నా ఫౌండేష‌న్‌లోని ప్ర‌తి రూపాయి నిరుపేద‌ల‌ను కాపాడ‌టానికే..... సోనూసూద్

నా ఫౌండేష‌న్‌లోని ప్ర‌తి రూపాయి నిరుపేద‌ల‌ను కాపాడ‌టానికే.....  సోనూసూద్

ఐటీ రైడ్స్‌పై సోనూసూద్ మౌనం 

కోవిడ్ సమయంలో ఎంతో మంది ప్రజలకు సాయం చేసి రియల్ హీరోగా మారిన సోనూసూద్‌ ఇల్లు, ఆఫీసులపై రీసెంట్‌గా ఐటీ అధికారులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సోను స్పందించారు.బాలీవుడ్ హీరో సోనూసూద్ కోవిడ్ స‌మ‌యంలో ఆప‌న్నుల‌కు అండ‌గా నిలిచి రియ‌ల్ హీరోగా ప్రూవ్ చేసుకున్నాడు. స్టార్ హీరోల‌కు సైతం లేని క్రేజ్ ఆయ‌న సొంతం చేసుకున్నాడు. సెల‌బ్రిటీలు చాలా మంది సోనూసూద్ చేస్తున్న ప‌నుల‌ను చూసి అప్రిషియేట్ చేశారు. అయితే, సోనూసూద్ ప‌నుల‌ను త‌ప్పు ప‌ట్టిన‌వారు కూడా ఉన్నారు. ఒకానొక ద‌శ‌లో ఆయ‌న రాజ‌కీయ స్వ‌లాభం కోసమే ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తున్నాడ‌ని కూడా విమ‌ర్శించిన‌వాళ్లు కూడా లేక‌పోలేదు. అయితే ఆ వార్త‌ల‌న్నింటినీ సోనూసూద్ ఖండించాడు. త‌న‌కు రాజ‌కీయాల్లో రావాల‌నే ఉద్దేశ‌మే లేద‌ని తేల్చి చెప్పేశాడు.

ఈ క్ర‌మంలో నాలుగు రోజుల ముందు ఆదాయ‌పు ప‌న్నుశాఖ వారు సోనూసూద్ ఇల్లు, ఆఫీసుపై రైడ్స్ చేశారు. ప్ర‌భుత్వానికి సోనూసూద్ రూ.20 కోట్ల ప‌న్ను క‌ట్ట‌లేద‌ని అధికారులు ప్ర‌క‌టించారు కూడా. అయితే వాటిపై సోనూసూద్ ఏమీ మాట్లాడ‌లేదు. కానీ సోమ‌వారం త‌న ట్విట్ట‌ర్ నుంచి ఓ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశారు. ప్ర‌తి పౌరుడి ప్రార్థ‌న‌లు ప్ర‌భావం చూపుతాయి, గ‌త‌కుల రోడ్డుపై కూడా ప్ర‌యాణం సాఫీగా సాగిపోతుంద‌ని చెప్పిన సోనూసూద్‌.

‘‘భారతీయులకు సేవ చేయాలని మనస్ఫూర్తిగా నేను మనసులో ప్రతిజ్ఞ చేసుకున్నాను. నా ఫౌండేష‌న్‌లోని ప్ర‌తి రూపాయి నిరుపేద‌ల‌ను కాపాడ‌టానికే. మాన‌వీయ కోణంలో కొన్ని కొత్త బ్రాండ్ల‌ను కూడా ప్రోత్స‌హించాను. అయితే గ‌త నాలుగు రోజులుగా అతిథులు(ఐటీ అధికారులు)తో బిజీగా ఉండిపోయాను. మీకు సేవ చేసుకోలేక‌పోయాను. మ‌ళ్లీ మీ జీవితాల్లోకి తిరిగొచ్చాను’’ అంటూ సెటైరిక‌ల్‌గా త‌న స్పంద‌న‌ను తెలియ‌జేశారు సోనూసూద్‌.

 

Tags :