విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న నటుడు సోనూసూద్

విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న నటుడు సోనూసూద్

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను సినీ నటుడు సోనూసూద్‍ దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమ్మవారి దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రజలంతా క్షేమంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించానని చెప్పారు. రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందాలన్నారు. కరోనా వల్ల ఎంతో మంది అనేక ఇబ్బందులకు గురయ్యారన్నారు. అమ్మవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణమైన సోనూసూద్‍కు పలువురు వినతులు అందజేశారు. సుమారు అర్ధగంట పాటు సోనూసూద్‍ ఆలయ ప్రాంగణంలో గడిపారు. ఆయనతో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు ఆలయ అర్చకులతో పాటు దేవస్థాన సిబ్బంది, పలువురు మహిళ భక్తులు పోటీ పడ్డారు.

 

Tags :