హీరో విజయ్ ఆగ్రహం...కేసు

హీరో విజయ్ ఆగ్రహం...కేసు

తమిళనాడులో సూపర్‌స్టార్‌గా పేరు ఉన్న నటుడు విజయ్‌ తనపేరును రాజకీయ లబ్దికి వాడుకోవడాన్ని తప్పుబడుతూ చెన్నై కోర్టులో  సివిల్‌ సూట్‌ దాఖలు చేశారు. తన పిటిషన్‌లో మొత్తం 11 మంది పేర్లను ఆయన చేర్చారు. వారిలో విజయ్‌ తల్లిదండ్రుల పేర్లు కూడా ఉన్నాయి. సభలు, సమావేశాలు పెట్టుకోవడానికి తన పేరు వాడుకుంటున్నారని తన పిటిషన్‌లో విజయ్‌ ఆరోపించారు. విజయ్‌కు తమిళ నాట విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేస్తారంటూ కొంతకాలంగా వాదనలు వినిపిస్తున్నాయి. ఈ విషయం గురించి పలుమార్లు తన అభిమానులతో విజయ్‌ చర్చలు కూడా జరిపారు.

ఈ నేపథ్యంలో విజయ్‌ ఫ్యాన్స్‌ కొంతమంది ఒక సొసైటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ ఆలోచనకు విజయ్‌ తల్లిదండ్రులు కూడా అంగీకరించారు. ఎందుకో విజయ్‌ తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్‌ రిజిస్టర్‌ చేసిన ‘విజయ్‌ మక్కల్‌ మండ్రమ్‌’ సొసైటీ కార్యక్రమాల నుంచి దూరంగా ఉంటున్నారు. ఇంతటితో ఆగని విజయ్‌ తండ్రి ‘ఆలిండియా తలపతి విజయ్‌ మక్కల్‌ మండ్రమ్‌’ పేరుతో పార్టీని కూడా రిజిస్టర్‌ చేశారు. విజయ్‌ మక్కల్‌ మండ్రమ్‌ సంఘం సభ్యులు సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనికోసం విజయ్‌ పేరును వాడుకుంటున్నారు. అలాగే త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో వీళ్లంతా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయడానికి సమాయత్తం అవుతున్నారు. ఈ ఎన్నికల్లో ఏదైనా జరిగితే డ్యామేజ్‌ అవుతుందన్న ఉద్దేశ్యంతో విజయ్‌ ఈ కేసు వేసినట్లు తెలుస్తోంది.

 

Tags :