తండ్రి గిండ్రి జాన్తా నై! అంటూ.... త‌ల్లిదండ్రులు స‌హా 11 మందిపై కేసు పెట్టిన ద‌ళ‌ప‌తి విజ‌య్

తండ్రి గిండ్రి జాన్తా నై! అంటూ.... త‌ల్లిదండ్రులు స‌హా 11 మందిపై కేసు పెట్టిన ద‌ళ‌ప‌తి విజ‌య్

కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ త‌న పేరును, త‌న ఫ్యాన్ క్ల‌బ్ పేరుని త‌ప్పుగా వినియోగించకుండా ఇన్‌జెక్ష‌న్ ఆర్డ‌ర్ ఇవ్వాలంటూ విజ‌య్ త‌న కోర్టును కోరారు.  త‌న త‌ల్లిదండ్రులు స‌హా 11 మందిపై చెన్నై సివిల్ కోర్టులో కేసు పెట్టారు. వీరు త‌న పేరును, త‌న ఫ్యాన్ క్ల‌బ్ పేరుని త‌ప్పుగా వినియోగిస్తున్నారంటూ, అలా ఉప‌యోగించ‌కుండా ఇన్‌జెక్ష‌న్ ఆర్డ‌ర్ ఇవ్వాలంటూ విజ‌య్ త‌న కోర్టును కోరారు.  వివ‌రాల్లోకెళ్తే.....  కొన్నిరోజుల ముందు విజ‌య్ తండ్రి, సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎ.చంద్ర‌శేఖ‌ర్ ఆల్ ఇండియా ద‌ళ‌ప‌తి విజ‌య్ మ‌క్క‌ల్ ఇయ‌క్క‌మ్ పేరుతో ఓ రాజ‌కీయ పార్టీని స్టార్ట్ చేశారు. ఈ పార్టీకి జ‌న‌రల్ సెక్ర‌ట‌రీగా ఎస్‌.ఎ.చంద్ర‌శేఖ‌ర్‌, ట్రెజ‌ర‌ర్‌గా శోభా చంద్ర‌శేఖ‌ర్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

2020లో త‌మిళ‌నాడులో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌య్ తండ్రి ఓ రాజకీయ పార్టీని స్టార్ట్ చేశారు. విజ‌య్ ఎన్నిక‌ల్లో పాల్గొంటారంటూ ప్ర‌క‌ట‌న కూడా చేశారు. అయితే, త‌న‌కు, త‌న తండ్రి స్టార్ట్ చేసిన రాజకీయ పార్టీకి ఏ సంబంధం లేదంటూ అప్ప‌ట్లో విజ‌య్ ఓ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశారు. త‌న తండ్రి, ఆయ‌ను స్థాపించిన పార్టీ త‌న పేరుని ఉప‌యోగించుకున్న‌ట్లు తెలిస్తే చ‌ట్ట ప‌ర‌మైన చ‌ర్యలు తీసుకుంటాన‌ని వెల్ల‌డించారు. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. బిగిల్ సినిమా త‌ర్వాత హీరో విజ‌య్ ఇప్పుడు నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై బీస్ట్ అనే సినిమాలో న‌టిస్తున్నారు. ఈ సినిమా ప్ర‌స్తుతం షూటింగ్ జ‌రుపుకుంటోంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఏదేమైనా త‌న మాట విననందుకు త‌ల్లిదండ్రులు స‌హా 11 మందిపై కేసు పెట్టిన హీరో విజ‌య్ మామూలోడు కాదని అంద‌రూ అనుకుంటున్నారు.

 

Tags :