తమ వ్య‌క్తిగ‌త జీవితంపై రాస్తున్న వార్తలపై సైబ‌ర్ పోలీసుల‌కు కంప్లైంట్‌ ఇచ్చిన పవిత్రా లోకేష్‌

తమ వ్య‌క్తిగ‌త జీవితంపై రాస్తున్న వార్తలపై సైబ‌ర్ పోలీసుల‌కు కంప్లైంట్‌ ఇచ్చిన పవిత్రా లోకేష్‌

తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మల‌యాళ చిత్రాల్లో ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో మెప్పించిన క్యారెక్ట‌ర్ ఆర్టిస్ పవిత్రా లోకేష్‌. రీసెంట్‌గా ఈమె వ్య‌క్తిగ‌త జీవితంపై సోష‌ల్ మీడియాలో వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయ్. సీనియ‌ర్ న‌టుడు వి.కె.న‌రేష్‌తో ఈమె వివాహం జ‌ర‌గ‌నుందని సారాంశం. దీనిపై సీనియ‌ర్ న‌రేష్‌, ప‌విత్రా లోకేష్ కూడా త‌మదైన వివ‌ర‌ణ‌ను ఇచ్చారు. తాజాగా ప‌విత్రా లోకేష్ సైబ‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. అందుకు కారణం మాత్రం.. ప‌విత్రా లోకేష్ క‌ర్ణాట‌క‌లో సైబ‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు ఎందుకు చేసింది? దానికి వారేం చేశారు ? అనే వివ‌రాల్లోకి వెళితే..ప‌విత్రా లోకేష్ పేరుతో కొందరు ఫేక్ అకౌంట్స్‌ను క్రియేట్ చేయ‌ట‌మే కాకుండా, ఆమెకు ఇబ్బంది క‌లిగించేలా, ఆమె పేరుని చెడ‌గొట్టేలా వార్త‌ల‌ను ప్ర‌చారం చేస్తున్నారంటూ ఆమె క‌ర్ణాట‌క సైబ‌ర్ పోలీసుల‌కు కంప్లైంట్‌ను ఇచ్చింది. పోలీసులు ఫిర్యాదు త‌ర్వాత ఇన్వెస్టిగేష‌న్‌ను స్టార్ట్ చేశారు.

సినీ నేప‌థ్య కుటుంబం కావ‌టంతో ఆ ప్ర‌భావం నుంచే ప‌విత్ర సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈమె తండ్రి, ప్ర‌ముఖ న‌టుడు మైసూర్ లోకేష్‌. భ‌ర్త సుచేంద్ర ప్ర‌సాద్‌, సోదరుడు ఆది లోకేష్ కూడా క‌న్న‌డ‌లో మంచి పేరున్న న‌టులుగా పేరు సంపాదించారు.సుచేంద్ర ప్ర‌సాద్‌ ను పెళ్లి చేసుకున్న ప‌విత్రా లోకేష్ కొన్నాళ్లుగా ఆయ‌న‌కు దూరంగా ఉంటోంది. ఆ స‌మ‌యంలో వి.కె.న‌రేష్‌తో ఏర్ప‌డ్డ ప‌రిచ‌యం ప్రేమ‌గా మారింద‌ని, వారు త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకుంటార‌నే వార్త‌లు అయితే గ‌ట్టిగానే వినిపిస్తున్నాయి. సుచేంద్ర ప్ర‌సాద్ నుంచి అధికారికంగా విడాకులు తీసుకోలేదు. దీంతో ఆమె ఇప్పుడు విడాకుల‌కు అప్ల‌య్ చేశార‌ని కూడా టాక్ వినిపిస్తోంది. 

 

Tags :