'పుష్ప' మూవీలో అల్లు అర్జున్ చెల్లెలిగా హీరోయిన్ వర్ష బొల్లమ్మ

'పుష్ప' మూవీలో అల్లు అర్జున్ చెల్లెలిగా హీరోయిన్ వర్ష బొల్లమ్మ

అల్లు అర్జున్- సుకుమార్ క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న 'పుష్ప' మూవీలో కామెడీ, రొమాన్స్, సెంటిమెంట్ ఇలా ఏ ఒక్కటీ మిస్ కాకుండా ఉండేలా కథ రాసుకున్న సుకుమార్ సిస్టర్ సెంటిమెంట్‌కి పెద్ద పీట వేశారని తెలుస్తోంది. అల్లు అర్జున్- సుకుమార్ క్రేజీ కాంబినేషన్‌లో 'పుష్ప' మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ మేజర్ పార్ట్ ఫినిష్ చేసుకుందని తెలుస్తోంది. రెండు భాగాలుగా విడుదల కాబోతున్న ఈ సినిమాలో కామెడీ, రొమాన్స్, సెంటిమెంట్ ఇలా ఏ ఒక్కటీ మిస్ కాకుండా ఉండేలా కథ రాసుకున్న సుకుమార్.. సిస్టర్ సెంటిమెంట్‌కి పెద్ద పీట వేశారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ చెల్లెలి పాత్ర కోసం ఐశ్వర్య రాజేష్‌ని సెలక్ట్ చేశారనే టాక్ నడించింది. కానీ లేటెస్ట్ సమాచారం మేరకు బన్నీ చెల్లెలిగా వర్ష బొల్లమ్మ అనే కుర్ర హీరోయిన్‌ని తీసుకున్నారని తెలుస్తోంది. హీరో అమితంగా ప్రేమించే తన సిస్టర్ ఓ ఫారెస్ట్ ఆఫీసర్ కారణంగా చనిపోవడం, ఆమె మరణానికి కారకుడైన వ్యక్తిని అన్వేషిస్తూనే పుష్పరాజ్ అడవుల్లో అడుగుపెట్టడం లాంటి సన్నివేశాలతో ఈ సినిమా కథ ఆసక్తికరంగా సాగిపోనుందని అంటున్నారు.

గతంలో 'మిడిల్ క్లాస్ మెలోడీస్'లో హీరోయిన్‌గా చేసిన వర్ష బొల్లమ్మకు ఈ ఆఫర్ ఇవ్వగానే చాలా సంతోషంతో వెంటనే ఓకే చెప్పిందట. మరికొద్ది రోజుల్లో ఆమెతో చేయబోయే సన్నివేశాల చిత్రీకరణ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన క్రేజీ బ్యూటీ రష్మిక మందన ఆడిపాడుతోంది. గిరిజన యువతిగా ఆమె అప్పీయరెన్స్ సినిమాలో చాలా కీలకం కానుందట. పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ సీట్ ఎడ్జ్ ఎంటర్‌టైనర్ ఇవ్వనున్నారని తెలియడంతో సినిమాపై బన్నీ అభిమానుల్లో ఉన్న ఆతృత రెట్టింపయింది. ఈ చిత్రంలో నేషనల్ వైడ్ బెస్ట్ టాలెంటెడ్ నటుల్లో ఒకరైన ఫహాద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తున్నాడు. అనసూయ రోల్ కీలకం కానుంది.

 

Tags :