MKOne Telugu Times Youtube Channel

అన్నీ జగన్‌కు తెలిసే జరిగాయి : ఆదినారాయణ రెడ్డి

అన్నీ జగన్‌కు తెలిసే జరిగాయి : ఆదినారాయణ రెడ్డి

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డిని హత్య చేస్తారనే విషయం సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి, భారతి, అవినాష్‌రెడ్డిలకు ముందే తెలుసని మాజీ మంత్రి, బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్బంగా  ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్‌ కూడా బాబాయి హత్యలో అవినాష్‌ రెడ్డికి మద్దతు ఇస్తున్నారనే విషయం అర్థమవుతోందన్నారు.  చేసిన తప్పులను అంగీకరించి అవినాష్‌ సరెండ్‌ అవ్వాలి. వివేకా హత్య జరిగిన వెంటనే జగన్‌కు కూడా సమాచారం అందింది. అజయ కల్లాం కూడా తెల్లవారుజామున జగన్‌కు చెప్పిన విషయాన్ని వెల్లడించారు. హత్య చేస్తారని తెలిసే ముందుగా జగన్‌ ఆ నలుగురితో సమావేశం పెట్టారు. అన్నీ జగన్‌కు తెలిసే జరిగాయి. వివేకానందరెడ్డి హత్య కేసులో దోషులు తప్పించుకోలేరు. అవినాష్‌, జగన్‌, భారతికి తెలిసే హత్య జరిగింది. వాళ్లకు  శిక్షపడే వరకు వివేకానందరెడ్డి ఆత్మ క్షోభిస్తుంది. అవినాష్‌ రెడ్డి ఈ రోజు విచారణకు హాజరవుతానని చెప్పి ఇప్పుడు తల్లి అనారోగ్యం పేరుతో కొత్త డ్రామాకు తెరతీశారు. సీబీఐ ఎదుట హాజరుకావాలని కోర్టు ఇప్పటికే స్పష్టంగా చెప్పింది. జగన్‌కు, బీజేపీకి దగ్గర సంబంధాలు ఉన్నాయనేది అపోహ మాత్రమే. ఆయన మాటల గారడీతో రాష్ట్రం సర్వనాశం అయింది. అలాంటి వ్యక్తిని ఎవరూ వెనుకేసుకు రారు అని అన్నారు.

 

 

Tags :