'ఆదిపురుష్' టీజర్ మైండ్ బ్లోయింగ్ !! రాముడిగా ప్రభాస్ అదరగొట్టాడుగా!

'ఆదిపురుష్' టీజర్ మైండ్ బ్లోయింగ్ !! రాముడిగా ప్రభాస్ అదరగొట్టాడుగా!

ఆదిపురుష్' మూవీ టీజర్ వచ్చేసింది. రామ జన్మభూమి అయోధ్యలో భారీగా తరలి వచ్చిన అభిమానుల నడుమ ఈ మూవీ టీజర్ లాంచ్ చేశారు. డార్లింగ్ ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. 'ఆదిపురుష్' టీజర్‌ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. రామ జన్మభూమి అయోధ్యలో భారీగా తరలి వచ్చిన అభిమానుల నడుమ ఈ మూవీ టీజర్ లాంచ్ చేశారు. ఇటీవల టీజర్ పోస్టర్‌ రిలీజ్ చేయగా.. డార్లింగ్ ఫ్యాన్స్‌కు తెగ నచ్చేసింది.

తాజాగా విడుదలైన టీజర్‌తో సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. డార్లింగ్ ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో ర‌చ్చ రంబోలా చేస్తున్నారు. టీజర్‌పై మీరూ ఓ లుక్కేయండి. ఇక టీజర్ విషయానికి వస్తే.. భూమి కృంగినా.. నింగి చీలినా.. న్యాయం చేతిలోనే అన్యాయానికి సర్వనాశనం అంటూ ప్రభాస్ వాయిస్‌తో స్టార్ట్ చేశారు. 'న్యాయం చేతుల్లోనే అన్యాయానికి సర్వనాశనం.. వస్తున్నా.. న్యాయం రెండు పాదాలతో నీ పది తలల అన్యాయాన్ని అణిచి వేయడానికి.. ఆగమనం.. అధర్మ విధ్వంసం..' అనే డైలాగ్స్ అదిరిపోయాయి. నీటిలో రాముడిలా ప్రభాస్ ధ్యానం చేస్తున్న షాట్స్.. రామసేతు మీద నడుస్తున్న షాట్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయి. రాముడి గెటప్‌లో ప్రభాస్‌ను చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. విజువల్స్ హాలీవుడ్ రేంజ్‌లో ఉన్నాయి. కొన్ని సీన్లు చూస్తే ఫ్యాన్స్‌కు పక్కా గూస్ బంప్స్ రావడం ఖాయం. రావణసురిడిగా సైఫ్ ఆలీ ఖాన్ గెటప్ కూడా సూపర్‌గా సెట్ అయింది. ఆదిపురుష్ టీజర్ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో దూసుకుపోతుండగా.. యూట్యూబ్‌లో కొత్త రికార్డులు సృష్టించనుంది.

ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా న‌టిస్తుండగా.. కృతి స‌న‌న్ జాన‌కి దేవి పాత్రలో క‌నిపించ‌నుంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ ఆలీ ఖాన్ రావ‌ణాసురుడిగా క‌నిపించ‌బోతున్నారు. 3డీ మోష‌న్ క్యాప్చర్ టెక్నాల‌జీతో ఆడియన్స్ ముందుకు రానుంది. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 12న మూవీని రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే నిర్మాతలు ప్రకటించిన విషయం తెలిసిందే.

Telugu Teaser : https://www.youtube.com/watch?v=ScCt7Lnz3mUh

https://twitter.com/PrabhasRaju/status/1576568613166673920

https://twitter.com/omraut/status/1576568168348209153

Hindi: https://bit.ly/AdipurushTeaser-Hindi

Telugu: https://bit.ly/AdipurushTeaser-Telugu

Tamil: https://bit.ly/AdipurushTeaser-Tamil

Kannada: https://bit.ly/AdipurushTeaser-Kannada

Malayalam: https://bit.ly/AdipurushTeaser-Malayalam

 

 

Tags :
ii). Please add in the header part of the home page.