హిట్ 2 ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్న ప్రైమ్....

హిట్ 2 ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్న ప్రైమ్....

నాని సొంత ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ బ్యానర్ లో తెరకెక్కిన రెండవ చిత్రం " హిట్ 2 ". ఈ సినిమా శుక్రవారం రోజు భారీ స్థాయిలో రిలీజైన విషయం తెలిసిందే. రిలీజైన మొదటిరోజే హిట్ 2 పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది.

దీంతో థియేటర్ లలో అడ్వాన్స్ బుకింగ్ సంఖ్య పెరిగిపోయింది. వీకెండ్ లో ఈ సినిమా భారీగా వసూలు చేసే అవకాశం కనిపిస్తుంది. మొదటి రోజుకంటే శని, ఆదివారాలు బాగా కలిసొస్తుంది అని చెప్పొచ్చు. ఈ సినిమాకి క్రిటిక్స్ నుండి కూడా మంచి రివ్యూస్ వచ్చాయి.

మొత్తానికి దర్శకుడు శైలేష్ రెండవ చిత్రానికి కూడా హిట్ అందుకున్నాడు అనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మరొక వర్గం నుండి ఈ చిత్రం అనుకున్నంత రేంజ్ లో ఆకట్టుకోలేకపోయింది అనే టాక్ కూడా వచ్చింది. కానీ , అది అంతగా ప్రభావం చూపించకపోవొచ్చు అనే చెప్పాలి.

అడవి శేష్ కెరీర్ లోనే హిట్ 2 భారీ ఓపెనింగ్స్ తీసుకొచ్చే అవకాశం ఉంది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ త్రిల్లర్ లో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. ముందుగానే ఈ సినిమా ఓటీటీ పార్టనర్ ని లాక్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది.

స్ట్రీమింగ్ హక్కులను కలిగి ఉన్న అమెజాన్ ప్రైమ్ వీడియో, సినిమా హక్కులని కూడా సంపాదించినట్టు సమాచారం. ఫస్ట్ హాట్ స్టార్ ఈ సినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకోడానికి భారీగా ఆఫర్ చేసినప్పటికీ , ముందుగానే అమెజాన్ ప్రైమ్ నానితో సీక్రెట్ గా ఒప్పందం చేసుకొని సుర్ప్రైజింగ్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

నాన్ థియేట్రీకల్గానే ప్రొడ్యూసర్స్ కి హిట్ 2 నుంచి మంచి ప్రాఫిట్స్ అందాయి. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 15 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ప్రెజెంట్ టాక్ ని బట్టి ఈ ఫ్రైడే నుండి ఓపెనింగ్స్ అందుకునే అవకాశం ఉంది. వీకెండ్ లో పోటీ ఇవ్వడానికి పెద్దగా సినిమా రిలీజ్ లు కూడా లేవు కాబట్టి సక్సెస్ రేట్ మరింత పెరుగుతుంది.

 

 

Tags :