హిట్లర్ చేతి గడియారం... వేలంలో భారీ ధర

హిట్లర్ చేతి గడియారం... వేలంలో భారీ ధర

జర్మనీ దివంగత నియంత అడాల్ఫ్‌ హిట్లర్‌కు చెందిన చేతి గడియారానికి వేలంలో భారీ ధర పలికింది. అమెరికా మేరీలాండ్‌లోని చెసపీక్‌ సిటీకి చెందిన అలెగ్జాండర్‌ హిస్టారికల్‌ ఆక్షన్స్‌ సంస్థ ఈ వేలాన్ని నిర్వహించింది. ఓ అజ్ఞాత వ్యక్తి 1.1 మిలియన్‌ డాలర్లకు  (సుమారు రూ.8.71 కోట్లు) గడియారాన్ని సొంతం చేసుకున్నట్లు ఆ సంస్థ వెల్లడిరచింది. వాచీ వెనుక వైపు స్వస్తిక్‌ చిహ్నంతో పాటు ఏ హెచ్‌ ఆంగ్ల అక్షరాలు పొందుపర్చి ఉన్నాయి. వేలంలో సంస్థ వివరాల ప్రకారం 1945లో ఫ్రెంచ్‌ సైన్యం హిట్లర్‌ తలదాచుకున్న స్థావరంపై దాడి చేసినప్పుడు ఓ సైనికుడు ఈ గడియారాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అనంతరం దాన్ని విక్రయించడాని, అప్పటి నుంచి అనేక మంది చేతులు మారుతూ వచ్చినట్లు అలెగ్జాండర్‌ హిస్టారికల్‌ ఆక్షన్స్‌ సంస్థ తెలిపింది.

 

Tags :