మాకు కొంత సమయం కావాలి... ప్రపంచ దేశాలకు తాలిబన్ ల విజ్ఞప్తి

మాకు కొంత సమయం కావాలి... ప్రపంచ దేశాలకు తాలిబన్ ల విజ్ఞప్తి

ప్రపంచ దేశాలకు ఆఫ్ఘన్‌ విదేశాంగ మంత్రి విజ్ఞప్తి చేశారు. అయితే మహిళల విద్య కల్పించే అంశంపై తమకు మరికొంత సమయం కావాలని అన్నారు. ఆఫ్ఘన్‌ చిన్నారులందరూ తిరిగి పాఠశాలలకు వెళ్లేందుకు అనుమతించాలంటూ అంతర్జాతీయంగా ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఆర్థిక సంక్షోభాన్ని నివారించే యత్నంలో భాగంగా ఇతర దేశాలతో సంబంధాలు పెట్టుకోవడానికి తాలిబన్‌ ప్రభుత్వం యత్నిస్తోంది. అంతర్జాతీయ సమాజం మాతో సహకరించాలి అని విదేశాంగ మంత్రి అమీర్‌ ఖాన్‌ ముత్తాక్వి కోరారు. దీంతో అభద్రతా భావాన్ని మేం నిలువరించగలుగుతాం. అదే సమయంలో ప్రపంచ దేశాలతో సానుకూలంగా వ్యవహరించగలుగుతాం అని అన్నారు. దోహలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.

 

Tags :