నేటి నుంచే వారానికి 2 రోజులు : విప్రో

నేటి నుంచే వారానికి 2 రోజులు : విప్రో

కొవిడ్‌ టీకా ప్రక్రియ ఊపందుకోవడంతో, ఐటీ సంస్థలు క్రమంగా ఇంటి నుంచి పనిని తగ్గిస్తున్నాయి. అయితే ఒకేసారి అందరినీ ఆఫీసులకు రానివ్వకుండా, వారంలో కొన్ని రోజులు ఇళ్ల వద్ద, మరికొన్ని రోజులు కార్యాలయాలకు వచ్చి పనిచేసే హైబ్రిడ్‌ విధానాన్ని సంస్థలు పాటిస్తున్నాయి. నేటి నుంచి తమ ఉద్యోగులందరూ కార్యాలయాలకు రానున్నారని విప్రో చైర్మన్‌ రిషద్‌ ప్రేమ్‌జీ తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా 18 నెలలుగా విప్రో ఉద్యోగులు ఇంటి నుంచే పని చేస్తున్నారని తెలిపారు.

18 నెలల సుదీర్ఘ విరామం తర్వాత విప్రోలోని మా నాయకులు నేటి నుంచి వారానికి రెండు సార్లు కార్యాలయాలకు రానున్నారు. అందరూ పూర్తిగా టీకాలను వేయించుకున్నారు. సురక్షితంగా, భౌతిక దూరంతో పనిచేసేందుకు ఉత్సుకతతో ఉన్నారు అని రిషద్‌ సృష్టం చేశారు. విప్రోలో ప్రస్తుతం రెండు లక్షల మంది ఉద్యోగులు పని చేస్తుండగా వారిలో 55 శాతం మందికి ఇప్పటికే పూర్తి వ్యాక్సినేషన్‌ అయినట్లు తెలుస్తోంది. వారానికి కొన్ని రోజుల పాటు కార్యాలయంలో మరికొన్ని రోజులు ఇంటి నుంచి పనిచేసే ఒక వినూత్న పని విధానానికి తమను తాము మలుచుకున్నామని, భవిష్యత్తులోనూ ఇలాగే పనిచేసే అవకాశం ఉందని తెలిపారు.

 

Tags :