60 రోజుల్లో మరో ఉద్యోగం చేయకుంటే.. అమెరికాను వీడాలి

60 రోజుల్లో మరో ఉద్యోగం చేయకుంటే.. అమెరికాను వీడాలి

అమెరికాలో అమెజాన్‌, మెటా, ట్విట్టర్‌ వంటి టెక్‌ సంస్థలు చేపట్టిన మూకుమ్మడి ఉద్యోగుల తొలగింపు భారతీయులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది.  ఈ ఉద్యోగులంతా ప్రస్తుతానికి హెచ్‌ 1బీ వీసాపై అమెరికాలో ఉంటున్నారు. ఉద్యోగం తొలగింపు తర్వాత 60 రోజుల మాత్రమే అమెరికాలో ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఆలోగా మరొక ఉద్యోగం చూసుకొని సంబంధిత కంపెనీ స్పాన్సర్‌షిప్‌తో హెచ్‌-1బీ పొందకపోతే అమెరికాను వీడాల్సి ఉంటుంది. వీరిలో చాలా మంది ఇప్పటికే గ్రీన్‌కార్డు మంజూరు కోసం ఏండ్లుగా ఎదురుచూస్తున్నారు. గ్రీన్‌కార్డుల మంజూరులో ఆలస్యం కారణంగా హెచ్‌-1బీపై కొనసాగుతున్న భారతీయ ఉద్యోగులపై తొలగింపు తీవ్ర ప్రభావం చూపుతున్నది. అటు గ్రీన్‌కార్డు మంజూరు కాక, ఇటు హెచ్‌-1బీ వీసా టైమ్‌ అయిపోతే ఏం చేయాలని ఆందోళన చెందుతున్నారు. 2020లో గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకొన్న భారతీయులు 195 ఏండ్లు వరకు చూడాల్సి ఉంటుందని యూఎస్‌ కాంగ్రెస్‌ నివేదిక ఇప్పటికే పేర్కొన్నది. ఇప్పటికే గ్రీన్‌కార్డు క్యూలో భారతీయులు దాదాపు 5 లక్షల మంది ఉన్నారు.

 

Tags :
ii). Please add in the header part of the home page.