రక్షణ మంత్రి కీలక ప్రకటన .. దీనిపై ఆందోళన అవసరం లేదు

రక్షణ మంత్రి కీలక ప్రకటన .. దీనిపై ఆందోళన అవసరం లేదు

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన అగ్నిపథ్‌పై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. కాగా పలు చోట్ల నిరసనలు, హింసాత్మకంగా మారాయి. ఈ నేపథ్యంలో అగ్నిపథ్‌ ఆందోళనలపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పందించారు.  అగ్నివీరుల భవిష్యత్‌కు ఢోకా లేదు. గరిష్ట వయోపరిమితిని 23 ఏళ్లకు పెంచుతున్నాం. రేండేళ్లుగా ఆర్మీ రిక్రూట్‌మెంట్స్‌ జరుగనందునే ఈ మినహాయింపు ఇస్తున్నాము. యువతను రక్షణ రంగంలోకి తీసుకెల్లే అద్భుత పథకం అగ్నిపథ్‌. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. భారత మాతకు సేవ చేసేందుకు ఇదో సువర్ణ అవకాశం ఈ అవకాశాన్ని యువత ఉపయోగించుకోవాలి అని సూచించారు.

 

Tags :