'డాన్స్ ఐకాన్' అనే సరికొత్త షో తో వస్తున్నారు ఆహా మరియు ఓక్ ఎంటర్ టైన్ మెంట్

'డాన్స్ ఐకాన్' అనే సరికొత్త షో తో వస్తున్నారు ఆహా మరియు ఓక్ ఎంటర్ టైన్ మెంట్

- 22 జూన్ నుండి ప్రారంభం కానున్న ఆడిషన్స్

నెమలికి నేర్పిన నడకలివి అని ఆనాడు పాడిన, రా రా రమంటున్న రణరంగంలో సిద్దంగున్నా చావో రేవో తేలాలిపుడే డాన్స్ అని ఈ మధ్య పాడినా, డాన్స్ అనే పదం వినపడగానే ప్రతి ఒక్కరికీ వారిలో ఉన్న ఒక డ్యాన్సర్ బయటికొస్తారు. మరి మీలో ఎవరైనా అలాంటి డ్యాన్సర్ ఉంటే, ఆ ప్రతిభ మీకుంటే ఆహా, ఓక్ ఎంటర్టైన్మెంట్ తో కలిసి సమర్పిస్తున్న 'డాన్స్ ఐకాన్' అనే షో మీ కోసమే. మీ ప్రతిభకు మా వేదిక శిరస్సు వంచి ఆహ్వానిస్తుంది. ఇంకా ఎందుకు ఆలస్యం, ఆడిషన్స్ ఇచ్చేయండి, డాన్స్ ఐకాన్ టైటిల్ ను గెలుచుకోండి.

జూన్ 22 నుండి ప్రారంభం కానున్న ఈ షో యొక్క డిజిటల్ ఆడిషన్స్ జులై 10 వరకు కొనసాగుతాయి. మీ వయస్సు 5 నుండి 50 మధ్యలో ఉన్నట్టయితే, మీరు తెలుగు రాష్ట్రాలకి చెందిన వారైతే, మీరు చేయాల్సిందల్లా ఒక్కటే. danceikon@oakentertainments.com అనే ఈమెయిల్ కు, 60 సెకండ్స్ మీ డాన్స్ వీడియోని మెయిల్ చేయండి.

ఈ షో యాంకర్ మరియు ప్రొడ్యూసర్ అయినా ఓంకార్ మాట్లాడుతూ, " ఈ షో ద్వారా నేను ఓ టి టి ప్లాట్ఫారం లోకి అడుగుపెడుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అరవింద్ గారికి ఇంకను ఆహ కు ధ్యానావదలు. నేను ఎన్నో డాన్స్ షోస్ చేశాను, కానీ ఇది చాల డిఫరెంట్ గా ఉండబోతుంది. ఈ షో కంటెస్టెంట్స్ తో పాటు వారిని కొరియోగ్రాఫ్ చేసే మాస్టర్ జీవితాన్ని కూడా మార్చేస్తుంది. గెలిచిన కంటెస్టెంట్ యొక్క కొరియోగ్రాఫర్ కు టాలీవుడ్ లో ఒక పెద్ద హీరో కి డాన్స్ కోరియోగ్రఫీ చేసే అవకాశం వస్తుంది. అది ఎవరు అని మేము ఫినాలే లో చెపుతాము. అందుకే ఈ షో మీ కోసమే. మీరో డాన్స్ చేయగలరు అనుకుంటే తప్పకుండా ఈ షో పార్టిసిపేట్ చేయండి అని కోరుకుంటున్నాను."

ఇంకా ఎందుకు ఆలస్యం, మీ డాన్స్ షూస్ వేసుకొని నచ్చిన పాటకి డాన్స్ చేసి - డాన్స్ ఐకాన్ అనిపించుకోండి.

 

Tags :