బ్లాక్‌బస్టర్ రియాలిటీ షో 'తెలుగు ఇండియన్ ఐడల్' సీజన్ 2 కి సిద్ధమైన ఆహా!

ఆహా అట్టహాసంగా మొదలైనప్పటి నుంచీ తమ ప్రేక్షకుల కోసం ఉత్కంఠభరితమైన, వినోదాత్మకమైన కంటెంట్ అందించడం మీద దృష్టి సారిస్తూనే ఉంది. ఆహా డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్‌లో ఇప్పటికే ఎన్నో అద్భుతమైన ఒరిజినల్స్, వరల్డ్ డిజిటల్ ప్రీమియర్స్, క్లట్టర్ బ్రేకింగ్ రియాలిటీ షోలు ప్రసారమయ్యాయి. వాటన్నిటికీ అదనంగా, ప్రత్యేక ఆకర్షణగా, వినోదాత్మకంగా ఉండేలా తీర్చిదిద్దింది తెలుగు ఇండియన్ ఐడల్ రియాలిటీ షోని. లోకల్ ఓటీటీ ప్లాట్ఫార్మ్ ఆహాలో అద్భుతమైన ఆదరణ పొందిన రియాలిటీ షో తెలుగు ఇండియన్ ఐడల్. తెలుగు రాష్ట్రాల్లోని పసందైన గళాల కోసం బ్రాండ్ న్యూ అవతార్‌లో ఇప్పుడు తెలుగు ఇండియన్ ఐడల్ 2 రూపుదిద్దుకుంటోంది.
తెలుగు ఇండియన్ ఐడల్ 2 లో తెలుగు రాష్ట్రాల్లోని అద్భుతమైన గళాలను ఆవిష్కరించే ప్రయత్నం చేస్తోంది ఆహా. ఈ షో ఫస్ట్ ఎడిషన్‌కి వచ్చిన అద్భుతమైన, హృద్యమైన స్పందన చూసి, ఈ సెకండ్ చాప్టర్‌ని ప్లాన్ చేసింది అచ్చ తెలుగు ఆహా.
ఫస్ట్ సీజన్ ఇచ్చిన ఉత్సాహాన్ని రెట్టింపు చేసేలా, శ్రావ్యమైన గళాలను ప్రేక్షకులకు పరిచయం చేసేలా, మరింత గ్రాండియర్‌గా రూపొందుతోంది సెకండ్ చాప్టర్.
భారతదేశపు అతి పెద్ద టాక్ షో అన్‌స్టాపబుల్2లో ఈ షో గురించి అనౌన్స్ చేశారు నందమూరి బాలకృష్ణ. ఫస్ట్ సీజన్లో ఎస్ ఎస్ తమన్, నిత్యామీనన్, కార్తిక్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. బీవీకే వాగ్దేవి ట్రోఫీ గెలుచుకున్నారు. శ్రీనివాస్, వైష్ణవి తొలి రెండు రన్నరప్ స్థానాల్లో నిలిచారు.
తెలుగు రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న శ్రావ్యమైన గళాలకు అద్భుత వేదికను ఏర్పాటు చేసి, ప్రపంచానికి పరిచయం చేయాలనే సదుద్దేశంతో ఈ షోని ప్లాన్ చేసింది ఆహా. 16 నుంచి 30 ఏళ్ల లోపున్నవారు ఈ షోలో పాల్గొనవచ్చు.
సీజన్ ఒన్తోనే తెలుగు ఇండియన్ ఐడల్ ఆరా తెలుగు రాష్ట్రాల్లో అద్భుతంగా వ్యాపించింది. ఆ జర్నీని కొనసాగించేలా ఇప్పుడు సీజన్ 2 కోసం ఆడిషన్స్ ని నిర్వహిస్తోంది ఆహా. హైదరాబాద్, బషీర్‌బాగ్‌లోని సెయింట్ జార్జి గ్రామర్ హై స్కూల్లో జనవరి 29న ఈ ఆడిషన్స్ జరగనున్నాయి. ప్రతిభావంతులైన, స్ఫూర్తిమంతులైన ఔత్సాహిక గాయనీగాయకులకు ఇదో సువర్ణావకాశం.
మీరు నెక్స్ట్ తెలుగు ఇండియన్ ఐడల్ ట్రోఫీ అందుకోవాలనుకుంటున్నారా? నెక్స్ట్ తెలుగు ఇండియన్ ఐడల్‌గా గుర్తింపు పొందాలనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? ఆడిషన్స్ లో తప్పక పాల్గొనండి. వచ్చే సీజన్లో తెలుగు ఇండియన్ ఐడల్ ట్రోఫీ విజేతగా మిమ్మల్ని మీరు చూసుకోండి!