పార్లమెంట్‌లో కరోనా కలకలం

పార్లమెంట్‌లో కరోనా కలకలం

పార్లమెంట్‌లో కరోనా కలకలం రేగింది. 400 మంది సిబ్బంది కరోనా బారిన పడ్డారు. పార్లమెంట్‌లో మొత్తం 1409 మంది పని చేస్తుండగా, ఈ నెల 4 నుంచి 8 మధ్య చేసిన టెస్టుల్లో ఈ కేసులు వెలుగు చేసినట్లు అధికారులు తెలిపారు. మరికొన్ని రోజుల్లో బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఒకేసారి ఇంత మంది కరోనా బారిన పడడంపై ఆందోళన నెలకొంది. పాజిటివ్‌ వచ్చిన సిబ్బందిలో వేరియంట్‌ ఏదో తెలుసుకోవడానికి జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం పంపినట్లు అధికారులు తెలిపారు. కాగా పాజిటివ్‌ వచ్చిన వారిలో 200 మంది లోక్‌ సభ సిబ్బంది కాగా, 69 మంది రాజ్యసభ సిబ్బంది, 133 అనుబంధ సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. వారితో కాంటాక్ట్‌ అయిన ఉన్నతాధికారులూ ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నట్లు చెబుతున్నారు.

 

Tags :