ప్రొటెం చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన జాఫ్రీ

ప్రొటెం చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన జాఫ్రీ

తెలంగాణ రాష్ట్ర శాసన మండలి ప్రొటెం చైర్మన్‌గా సయ్యద్‌ అమీనుల్‌ హసన్‌ జాఫ్రీ శాసన మండలిలోని తన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, హోం మంత్రి మహమూద్‌ అలీ, శాసనసభ్యులు  ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌, పాషాఖాద్రీ, జాఫర్‌ హుస్సేన్‌ మెరాజ్‌,  ఎంఎల్‌సీలు వి.గంగాధర్‌ గౌడ్‌, తాత మధు, దండే విట్టల్‌, మీర్జా రియాజ్‌ ఉల్‌ హసన్‌, రాష్ట్ర లెజిస్లేచర్‌ సెక్రెటరీ నరసింహాచార్యులు, మాజీ ఎంఎల్‌సీ మాగం రంగారెడ్డి, జాఫ్రీ కటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Tags :