తెలంగాణ శాసనమండలి ప్రొటెం చైర్మన్‌గా జాఫ్రీ

తెలంగాణ శాసనమండలి ప్రొటెం చైర్మన్‌గా జాఫ్రీ

తెలంగాణ శాసనమండలి ప్రొటెం చైర్మన్‌గా ఎంఐఎం ఎమ్మెల్సీ సయ్యద్‌ అమీర్‌ఉల్‌హసన్‌ జాఫ్రీని నియమిస్తూ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఉత్తర్వులను వెలువరించారు. శాసనమండలికి కొత్త చైర్మన్‌ ఎంపిక జరిగే వరకు ఆ పదవిలో ఆయన కొనసాగుతారని విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రొటెం చైర్మన్‌గా ఉన్న వెన్నంపల్లి భూపాల్‌ రెడ్డి పదవీకాలం ముగిసిన నేపథ్యంలో ఆయన స్థానంలో జాఫ్రీని నియమించారు. శాసనమండలి చైర్మన్‌ రేసులో ఎమ్మెల్సీలు మధుసూధనాచారి, కడియం శ్రీహరి ఉన్నట్లు  ప్రచారం  జరుగుతున్నది. ఇప్పట్లో శాసనసభ, శాసనమండలి సమావేశాలు లేనందున వెంటనే ఆ పదవులను భర్తీ చేసే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఫిబ్రవరి నెలాఖరులోగానీ, మార్చి మొదటి వారంలో గానీ బడ్జెట్‌ సమావేశాలకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. అప్పుడు శాసనమండలి చైర్మన్‌ ప్రకటించే అవకాశం ఉన్నది.

 

Tags :