ఐఎఎఫ్ నూతన చీఫ్‌గా వివేక్ రామ్

ఐఎఎఫ్ నూతన  చీఫ్‌గా వివేక్ రామ్

ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ (ఐఎఎఫ్‌) నూతన చీఫ్‌గా ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ (ఎసిఎం) వివేక్‌ రామ్‌ చౌదరి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న ఎసిఎం ఆర్‌కెఎస్‌ భదౌరియా పదవీ విరమణతో వివేక్‌ రామ్‌ చౌదరి ఈ బాధ్యతలు స్వీకరించారు. 27వ ఐఎఎఫ్‌ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా వివేక్‌ రామ్‌ మాట్లాడుతూ ఎంతటి మూల్యానికైనా మన దేశ సౌరభౌమత్వాన్ని, సమగ్రతను రక్షిస్తానని తెలిపారు. ఎలాంటి బాధ్యతలైనా ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. కాగా ఇండియన్‌ నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ కరంబీర్‌ సింగ్‌ నవంబర్‌లోనూ, భారత ఆర్మీ చీఫ్‌ మనోజ్‌ నరవణే వచ్చే ఏడాది ఏప్రిల్‌లో పదవీ విరమణ చేయనున్నారు.

 

Tags :