రిపబ్లిక్ డే సందర్భంగా... ఎయిరిండియా స్పెషల్ ఆఫర్

రిపబ్లిక్ డే సందర్భంగా... ఎయిరిండియా స్పెషల్ ఆఫర్

ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా రిపబ్లిక్‌ డే సందర్భంగా  విమాన టికెట్ల ధరలపై రాయితీని ప్రకటించింది. దేశీయ ప్రయాణాలకు లిమిటెడ్‌ సీట్లకు మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుందని ఎయిరిండియా తన అధికారిక వెబ్‌సైట్‌లో తెలిపింది. ఎంపిక చేసిన 49 రూట్లలో ముందుగా టికెట్‌ బుక్‌ చేసుకున్న వారికి ప్రాధాన్యం ఉంటుందని తెలిపింది.  జనవరి 21 నుంచి జనవరి 23 మధ్య టికెట్లను బుక్‌ చేసుకునే వారికి ఈ డిస్కౌంట్‌ వర్తిస్తుందని ఎయిరిండియా తెలిపింది. ఫిబ్రవరి 1 నుంచి సెప్టెంబర్‌ 30 మధ్య ప్రయాణించొచ్చని పేర్కొంది. ఎయిరిండియా సిటీ ఆఫీస్‌, ఎయిర్‌పోర్ట్‌ ఆఫీస్‌, వెబ్‌సైట్స్‌, మొబైల్‌ యాప్స్‌, ట్రావెల్‌ ఏజన్స్‌ ద్వారా టికెట్లను బుక్‌ చేసుకోవచ్చని పేర్కొంది. టికెట్‌ ధరలు రూ.1705 నుంచి ప్రారంభమవుతాయిని తెలిపింది. ఎంపిక చేసిన రూట్లలో డిస్కౌంట్‌ ధరలు ఇవేనంటూ కొన్నింటి ధరలను ఎయిరిండియా తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.

 

 

Tags :