హైదరాబాద్ నుంచి లండన్ కు ఎయిర్ ఇండియా సేవలు

హైదరాబాద్ నుంచి లండన్ కు  ఎయిర్ ఇండియా సేవలు

హైదరాబాద్‍ నుంచి లండన్‍కు నాన్‍స్టాప్‍ విమానాలను ప్రారంభించనున్నట్లు ఎయిర్‍ ఇండియా తెలిపింది. వారానికి రెండు రోజులు సోమ, శుక్రవారాల్లో ఈ విమానాలు హైదరాబాద్‍ నుంచి లండన్‍కు వెళ్తాయి. ఆది, గురువారాల్లో లండన్‍ నుంచి హైదరాబాద్‍ వస్తాయి. హైదరాబాద్‍ నుంచి లండన్‍కు 10:30 గంటల సమయం పడుతుంది. లండన్‍ నుంచి హైదరాబాద్‍ రావటానికి 9:20 గంటల సమయం పడుతుంది. ఈ  విమానంలో 256 మంది ప్రయాణించేందుకు అవకాశం ఉంది. 18 బిజినెస్‍ క్లాస్‍ టికెట్లు కాగా, మిగలిన 238 సీట్లు ఎకానమీ తరగతిలో ఉంటాయి.

 

Tags :