దుబాయ్ ఎయిర్‌షో సందర్భంగా భారీ ఒప్పందం

దుబాయ్  ఎయిర్‌షో సందర్భంగా భారీ ఒప్పందం

111 విమానాల కోసం అమెరికాకు చెందిన విమానాల లీజుదారు ఎయిర్‌లీజ్‌ కార్పొరేషన్‌ నుంచి భారీ ఆర్డరు లభించినట్లు ఎయిర్‌బస్‌ ప్రకటించింది. ఈ ఒప్పందం విలువ 1500 కోట్ల డాలర్ల (రూ.1.12 లక్షల కోట్ల) కంటే అధికంగా ఉండొచ్చని అంచనా. దుబాయ్‌ ఎయిర్‌షో సందర్భంగా ఈ ఒప్పందం కుదిరింది. ఎయిర్‌బస్‌ ఏ220-330లు 25, ఏ321 నియో విమానాలు 55, ఏ321 ఎక్స్‌ఎల్‌ఆర్‌లు 20, ఏ330 నియోలు నాలుగు ఏ350ఎఫ్‌ విమానాలు ఏడింటిని ఎయిర్‌బస్‌ అందించాల్సి ఉంటుంది. పరిస్థితులు సానుకూలమవుతున్నాయని ఎయిర్‌బస్‌ సీఈవో గిలియామే ఫారీ తెలిపారు. ఇప్పటికే ఈ ఎయిర్‌షోలో 255 కొత్త విమానాల కోసం ఇండిగో పార్ట్‌నర్స్‌ నుంచి ఎయిర్‌బస్‌కు అత్యంత భారీ ఆర్డరు వచ్చింది. దీని విలువ దాదాపు 30 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.2.25 లక్షల కోట్లు) అని అంచనా వేస్తున్నారు.

 

Tags :