24 గంటల ముందే.. అంతర్జాతీయ ప్రయాణికుల వివరాలు

24 గంటల ముందే.. అంతర్జాతీయ ప్రయాణికుల వివరాలు

నేరస్థులు దేశం విడిచి పారిపోకుండా నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విమానాలు బయల్దేరే 24 గంటల ముందే అంతర్జాతీయ ప్రయాణికుల వివరాలను కస్టమ్స్‌ అధికారులకు తెలియజేయాలని కేంద్ర విమానయన సంస్థలను కోరింది. ప్రయాణికుల కాంటాక్ట్‌ల తోపాటు వారి పీఎన్‌ఆర్‌ నంబర్లు, వారు చెల్లింపులు చేసిన డెబిట్‌/ క్రెడిట్‌ కార్డు వివరాలనూ అందించాలని సూచించింది. భారత్‌ నుంచి విదేశాలకు వెళ్లే ప్రయాణికులపై కస్టమ్స్‌ అధికారులు దృష్టి పెట్టేందుకు ఈ సమాచారం ఉపపయోగడపుతుంది. దీంతో విదేశాలకు పారిపోయే నేరగాళ్లను గుర్తించడం తేలిక వుతుంది. ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్స్‌, కస్టమ్స్‌ బోరు ప్యాసింజర్‌ నేమ్‌  రికార్డ్‌ ఇన్ఫర్మేషన్స్‌ - 2022ని నోటీపై చేసింది. దాన్ని పాటించాలని అన్ని విమానాయన సంస్థలను ఆదేశించింది.

 

Tags :