ఐశ్వర్య రాజేష్ “డ్రైవర్ జమున” ట్రైలర్

ఐశ్వర్య రాజేష్ “డ్రైవర్ జమున” ట్రైలర్

అద్భుతమైన నటనతో విభిన్నమైన సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ఐశ్వర్య రాజేష్. విలక్షణమైన పాత్రలలో ఆకట్టుకుంటున్న ఐశ్వర్య రాజేష్ తాజాగా 'డ్రైవర్ జమున' పేరుతో మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధమౌతున్నారు. ఔట్ అండ్ ఔట్ రోడ్ మూవీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పా. కిన్‌స్లిన్‌ దర్శకత్వం వహిస్తుండగా 18 రీల్స్‌పై ఎస్.పి.చౌదరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.

ఇంట్లో వారికి ఇష్టం లేకపోయినా క్యాబ్ డ్రైవింగ్ ని వృత్తిగా మార్చుకుంటుంది జమున. ఒక రైడ్ ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది. ఆ  రైడ్ ఆమె క్యాబ్‌లో ప్రయాణించే ప్రయాణీకులకు నేర నేపథ్యం వుండటం, వారి ప్రాణాలకు ముప్పు ఉన్నందున జమున కూడా  ప్రమాదంలో పడటం.. . చివరికి ఈ ప్రమాదం నుండి జమున ఎలా బయటపడింది అనేది కథలో కీలకాంశం.

ట్రైలర్‌ని బట్టి చూస్తే, ఈ చిత్రం పేసీ స్క్రీన్‌ప్లేతో సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌ అనిపిస్తోంది. ఐశ్వర్య రాజేష్ తన అద్భుతమైన నటనతో మరింత ఇంటెన్స్‌ని తీసుకొచ్చింది. కెమెరా పనితనం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అవుట్ స్టాండింగా వున్నాయి.

ఐశ్వర్య రాజేష్ ప్రతి ఒక్క షాట్‌ను ఎటువంటి డూప్‌లను నటించారు. ఈ చిత్రంలో తన పాత్ర వాస్తవానికి దగ్గరగా వుండే విధంగా స్వయంగా రోడ్లపై కారుని నడిపారు.

డ్రైవర్ జమున ట్రైలర్ కి అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఐశ్వర్య రాజేష్ ఎక్స్ టార్డినరీ ఫెర్ఫార్మెన్స్, యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచాయి.  

జిబ్రాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కి గోకుల్ బెనోయ్ సినిమాటోగ్రాఫర్ గా, ఆర్ రామర్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.  

ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఒకే సమయంలో విడుదల చేయనున్నారు.

 

 

Tags :