" అఖండ " వార్షికోత్సవం ...!

" అఖండ " వార్షికోత్సవం ...!

టాలీవుడ్ లో ఎవర్  గ్రీన్ కాంబినేషన్ లో బాలయ్య బాబు, బోయపాటి శీను ముందుంటారు. వీరి కాంబినేషన్ లో " సింహా, లెజెండ్ " బాక్సాఫీస్ వద్ద భారీగా విజయాన్ని సాధించాయి. ఇక ముచ్చటగా మూడవ సినిమా "అఖండ" సెట్స్ పైకి రాబోతుంది అని తెలిసినప్పటినుండి కూడా ఈ మూవీ పై భారీగా అంచనాలు పెరిగాయి.

"అఖండ" సినిమా అంచనాలకి తగ్గట్టుగా బాలయ్య అభిమానులనే కాకుండా, సినీ ప్రేక్షకులని కూడా ఆకట్టుకోవడంతో అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. గతేడాది డిసెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా సరిగ్గా ఈ డిసెంబర్ 2023 కి  సంవత్సరం కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమా సాధించిన వసూళ్లు చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

దాదాపు 200 కోట్ల వసూళ్లు సాధించడంతో పాటు అత్యధిక థియేటర్స్ లో 50 రోజులు ఆడిన సినిమాగా కూడా అఖండ రికార్డ్స్ సృష్టించింది. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయగా, ప్రాగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.

ఇక ఈ చిత్ర విజయంతో బాలయ్య  బాబు మరింత జోష్ గా సినిమాలు చేస్తున్నారు. త్వరలోనే అఖండ సీక్వెల్ తీస్తానని దర్శకుడు బోయపాటి శీను ప్రకటించారు. ఆల్మోస్ట్ బాలయ్య ద్విపాత్రాభినయం చేసిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. అఖండ విజయం మరోసారి ఆ విషయాన్ని నిరూపించింది అని చెప్పొచ్చు.

ఈ చిత్రం విడుదలయి సరిగ్గా సంవత్సరం పూర్తవడంతో నందమూరి అభిమానులు సోషల్ మీడియా లో సందడి చేస్తున్నారు. అఖండ విజయానికి వార్షికోత్సవ వేడుకలు జరుపుతున్నట్లు తెలుస్తుంది.

 

 

Tags :