బాలకృష్ణపై అక్కినేని అభిమానులు ఫైర్ : క్షమాపణలు చెప్పాల్సిందే! - అక్కినేనికి అభిమానులు

నందమూరి బాలకృష్ణ నోరు జారిన విషయం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. రెండు రోజుల క్రితం అక్కినేని తొక్కినేని అంటూ బాలయ్య అనడంపై అక్కినేని ఫ్యాన్స్ మండిపడుతునున్నారు. నందమూరి ఫ్యామిలీ గురించి అక్కినేని నాగార్జున ఎప్పుడైనా ఇలా మాట్లాడారా? అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ రెండు రోజుల క్రితం ‘వీరసింహా రెడ్డి’ సక్సెస్ మీట్లో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దివంగత అక్కినేని నాగేశ్వరరావు గురించి ప్రస్తావిస్తూ ‘అక్కినేని.. తొక్కినేని’ అంటూ బాలయ్య నోరుజారారు. దాంతో అక్కినేని అభిమానులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో నందమూరి బాలకృష్ణ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు.
అయితే..ఈ విషయం లో అక్కినేని నాగార్జున ఇప్పటి వరకూ ఈ వివాదంపై స్పందించలేదు. కానీ.. అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్ మాత్రం ఘాటుగానే స్పందించారు. దాంతో వ్యవహారం మరింతగా ముదురుతున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఆల్ ఇండియా అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సర్వేశ్వరరావు తెరపైకి వచ్చారు. నందమూరి బాలకృష్ణ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమండ్ చేస్తూనే.. నందమూరి ఫ్యామిలీ గురించి ఇలా ఎప్పుడైనా అక్కినేని నాగార్జున మాట్లాడారా? అంటూ సూటిగా ప్రశ్నించారు. ఇంతకీ బాలయ్య ఏమన్నారంటే? "వీరసింహా రెడ్డి మూవీకి పనిచేసిన ఓ వ్యక్తిని పరిచయం చేస్తూ ‘సెట్లో ఈయన ఉన్నారంటే.. నాకు మంచి టైపాస్. వేదాలు, శాస్త్రాలు, నాన్న గారు, డైలాగ్‌లు.. ఆ రంగారావు.. ఈ అక్కినేని తొక్కినేని అన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉండేవాళ్లం" అని చెప్పుకొచ్చారు. కానీ.. అక్కినేని నాగేశ్వరరావుని కించపరుస్తూ అక్కినేని.. తొక్కినేని అనడంపై అభిమానులు మండిపడుతున్నారు. ఈ వివాదంపై ఆల్ ఇండియా అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సర్వేశ్వరరావు స్పందించారు. ‘అక్కినేని నాగేశ్వరరావు నాకు బాబాయ్ లాంటి వారు అని గతంలో నందమూరి బాలకృష్ణ చెప్పారు. కానీ జనవరి 22న ఆయన వర్ధంతి అదే రోజున సక్సెస్ మీట్‌ని పెట్టుకున్నారు. ఆ వేదికపై ఏం మాట్లాడుతున్నానో కూడా బాలయ్యకి తెలియకుండా పోయింది. ఇలా మహా నటుల గురించి జోక్‌గా మాట్లాడుకోవడం సమంజసం కాదు. నందమూరి హీరోల గురించి అక్కినేని నాగార్జున ఎప్పుడైనా ఇలా మాట్లాడారా? బాలయ్య వెంటనే క్షమాపణలు చెప్పాలి’ అని సర్వేశ్వరరావు డిమాండ్ చేశారు. బాలయ్య వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో అక్కినేని నాగచైతన్య, అఖిల్ స్పందించారు. ‘నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావుగారు, ఎస్వీ రంగారావు గారు తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలు.. వారిని అగౌరవపరచటం మనల్ని మనమే కించపరుచుకోవటం’ అని ట్వీట్స్ చేశారు.
Naga Chaitanya Tweet
https://twitter.com/chay_akkineni/status/1617787090519064583
Akhil Tweet
https://twitter.com/AkhilAkkineni8/status/1617788291750965256