ఆసక్తి కలిగిస్తున్న 'అలాంటి సిత్రాలు'

ఆసక్తి కలిగిస్తున్న 'అలాంటి సిత్రాలు'

డైరక్టర్ పూరీ జగన్నాథ్ దగ్గర రచనా విభాగంలో పనిచేసిన సుప్రీత్ సి. కృష్ణ  కొత్త నటీనటులతో తెరకెక్కిస్తున్న సినిమా అలాంటి సిత్రాలు. కె. రాఘవేంద్ర రెడ్డి సమర్ఫణలో ఐ అండ్ ఐ ఆర్ట్స్ మరియు కాస్మిక్ రే ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై శ్రీ వరుణ్, రాహుల్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ఈ క్రమంలో తాజాగా అలాంటి సిత్రాలు ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేశారు.

ట్రైలర్ చూస్తుంటే విభిన్న మనస్తత్వాలు కలిగిన నలుగురు వ్యక్తులు అనుకోకుండా ఒకరి దారిలో మరొకరు కలిసినప్పుడు వారి జీవిత గమనంలో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలే  ఈ సినిమాగా తెలుస్తుంది. చిన్న సినిమా అయినప్పటికీ ఈ ట్రైలర్ తో కంటెంట్ విషయంలో పెద్ద చిత్రమని అర్థమవుతంది. మనం బ్రతకడానికి ఏ పని చేసినా తప్పులేదు. ఇది తప్పు అని చెప్పడానికి ఇక్కడ ఎవరూ కరెక్ట్ కాదు, ఎవరి వ్యభిచారం వాడు చేస్తున్నాడు లాంటి డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి ఈ కథకు మెట్రో ట్రైన్ లో జర్నీకి లింక్ చేస్తూ స్క్రీన్ ప్లే ఉన్నట్లు తెలుస్తుంది. బోల్డ్ సీన్స్, ఎమోషన్స్ తో ఈ ట్రైలర్ ఆద్యంతం సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. సంతు ఓంకార్ సంగీతం అందిచగా, కార్తిక్ సాయి కుమార్ కెమెరా మెన్ గా వ్యవహరించారు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Tags :