వారి ఓట్లు లేకుండా ఎవరు చట్టసభల్లో అడుగుపెట్టలేరు

వారి ఓట్లు లేకుండా ఎవరు చట్టసభల్లో అడుగుపెట్టలేరు

బీసీల ఓట్లు లేకుండా ఎవరూ చట్టసభల్లో అడుగుపెట్టలేరని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. టీపీసీసీ ఓబీసీ సెల్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో రేవంత్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక న్యాయం జరగాలంటే కుల గణన జరగాలని అన్నారు. మోదీ వన్‌ నేషన్‌ వన్‌ సెన్సెక్స్‌ను ఎందుకు తీసురావడం లేదన్నారు. మోదీ ప్రభుత్వం కుల గణన చేయకపోవడంలో మతలబు ఏంటి? అని ప్రశ్నించారు. కుల గణన చేస్తేనే రాజకీయాల్లో బీసీల ప్రాతినిధ్యం పెరుగుతుందన్నారు. బీసీలు కులగణన కోరడంలో న్యాయముందన్నారు. బీసీలకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్‌ పార్టీ పోరాడుతుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక బీసీలకు ఎలా న్యాయం చేయాలో ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్తామన్నారు. బీసీ సంఘాలు చేసే అన్ని ఉద్యమాలకు కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ఉంటుందని అన్నారు. సమగ్ర కుటుంబ సర్వేను సీఎం కేసీఆర్‌కు ఎందుకు బయట పెట్టడం లేదన్నారు. దీని వెనుక పెద్ద కుట్ర ఉందన్నారు. ఇప్పటికైనా సమగ్ర కుటుంబ సర్వే నివేదికను బయటపెట్టాలన్నారు.

 

Tags :