విజయవాడ నుంచి అలయన్స్ ఎయిర్ సర్వీసులు

విజయవాడ నుంచి అలయన్స్ ఎయిర్ సర్వీసులు

ఎయిర్‌ ఇండియా అనుబంధ సంస్థ అలయన్స్‌ ఎయిర్‌ డిసెంబర్‌ 1 నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్‌, బెంగళూరులకు కొత్త సర్వీసులను ప్రారంభిస్తోంది. ఈ విమానం ప్రతిరోజు ఉదయం 7:55 గంటలకు బెంగళూరులో బయలుదేరి విజయవాడకు 9:30కు చేరుకుంటుంది. తిరిగి విజయవాడలో 10 గంటలకు బయలుదేరి 11:40కు బెంగళూరు చేరుకుంటుంది. హైదరాబాద్‌లో ప్రతిరోజు సాయం 6:10 గంటల బయలుదేరి రాత్రి 7:10 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. తిరిగి రాత్రి 7:40 బయలుదేరి 8:40 గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటుంది. టికెట్ల ధరలను బెంగళూరు`విజయవాడకు రూ.3,762, విజయవాడ-బెంగళూరుకు రూ.3,692, హైదరాబాద్‌-విజయవాడకు రూ.2,931, విజయవాడ-హైదరాబాద్‌కు రూ.2,747గా నిర్ణయించింది.

 

Tags :