MKOne Telugu Times Youtube Channel

సుకుమార్ స‌ర్‌ప్రైజ్ కోసం వెయిట్ చేస్తున్న బ‌న్నీ ఫ్యాన్స్

సుకుమార్ స‌ర్‌ప్రైజ్ కోసం వెయిట్ చేస్తున్న బ‌న్నీ ఫ్యాన్స్

ఇప్పుడు ఇండియ‌న్ సినిమాస్‌లో మోస్ట్ అవెయిటెడ్ సినిమాలంటే అందులో ముందుగా చెప్పేది పుష్ప‌-2నే. ఏడాదిన్న‌ర క్రితం రిలీజ్ అయిన పుష్ప తెలుగుతో పాటూ ప‌లు భాష‌ల్లో విడుద‌లై సంచ‌ల‌నాలు సృష్టించింది. ముఖ్యంగా ఈ మూవీ హిందీ మార్కెట్లో తెగ పాపుల‌రైంది.

బ‌న్నీ మేన‌రిజ‌మ్స్, బాడీ లాంగ్వేజ్, సాంగ్స్ పుష్ప‌ను అంత‌ర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి, ప్ర‌పంచ‌మంతా పుష్ప గురించి మాట్లాడేలా చేసాయి. దీంతో పుష్ప‌2 మీద అందరికీ భారీ అంచ‌నాలేర్ప‌డ్డాయి. కొన్ని నెల‌ల క్రిత‌మే పుష్ప‌2 షూటింగ్ మొద‌లైంది. దాదాపు 20% వ‌ర‌కు సినిమా పూర్తైన‌ట్లు తెలుస్తోంది. 

అయితే ప్ర‌స్తుతం ఆ షూట్ ఆపేసి, ఫ‌స్ట్ గ్లింప్స్ మీద వ‌ర్క్ చేస్తోంద‌ట చిత్ర యూనిట్. ఏప్రిల్ 8న బ‌న్నీ బ‌ర్త్ డే ఈ గ్లింప్స్ రిలీజ్ చేయాల‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన డ‌బ్బింగ్‌ను ప్ర‌స్తుతం బ‌న్నీ చెప్తున్నాడ‌ట‌. అయితే సినిమా మొద‌లుపెట్టిన‌ప్పుడే సుకుమార్ బ‌న్నీ మీద ఓ ఫోటో షూట్ చేశారు. ఆ లుక్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుంద‌ని స‌మాచారం.

దీంతో పాటు వెరైటీ కాన్సెప్ట్‌తో టీజ‌ర్‌ను కూడా షూట్ చేశారు. అయితే బ‌న్నీ బ‌ర్త్ డే కి కేవ‌లం ఆ ఫోటో షూట్ లుక్ రిలీజ్ చేయాలా లేక టీజ‌ర్ గ్లింప్స్ రిలీజ్ చేయాలా అనే సందిగ్ధంలో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఏదైనా స‌రే బ‌న్నీ బ‌ర్త్ డే కు ముందు రోజు రిలీజ్ అవుతుంది. పుష్ప‌2 నుంచి ఏది రిలీజైనా స‌రే ఒక రెండు రోజులు ఇండియ‌న్ మూవీస్ లో ఇది త‌ప్ప వేరే దేని గురించి మాట్లాడుకోని విధంగా ఆ కంటెంట్‌ను ప్లాన్ చేస్తున్న‌డ‌ట సుకుమార్. మొత్తానికి బ‌న్నీ బ‌ర్త్ డే కి సుక్కూ ఇచ్చే స‌ర్‌ప్రైజ్ కోసం ఫ్యాన్స్ అంతా తెగ వెయిట్ చేస్తున్నారు.

 

 

Tags :