రివ్యూ : చతికిలపడ్డ 'అల్లుడు అదుర్స్'

రివ్యూ : చతికిలపడ్డ 'అల్లుడు అదుర్స్'

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.5/5  
జానర్ : రొమాంటిక్‌ కామెడీ
నిర్మాణ సంస్థ :  సుమంత్‌ మూవీస్
నటీనటులు :  బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నభా నటేష్, అను ఇమ్మాన్యుయేల్, సోను సూద్, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, సత్య అక్కల, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, బ్రహ్మజీ
సంగీతం : దేవి శ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ : చోటా కె. నాయుడు
ఎడిటర్‌ :  తమ్మిరాజు, నిర్మాత :   గొర్రెల సుబ్రహ్మణ్యం
దర్శకత్వం : సంతోష్‌ శ్రీనివాస్‌
విడుదల తేది : 14. 01. 2021

సంక్రాంతికి   'అల్లుడు' అనే పదానికి విడదీయరాని పదం ఆ  సెంటిమెంట్ ఈనాటిది కాదు అనాదిగా వస్తున్నదే! ఈ సెంటిమెంట్ తో  తెలుగు ప్రేక్షకులకు ఎంటర్‌టైనర్ చేయాలనే కోణంలో సంక్రాంతి అల్లుడిగా ఈ 'అల్లుడు అదుర్స్' అని ముందుగా కనుమ రోజు అనుకున్నా...ఈ సంక్రాంతి రోజునే రంగంలోకి దిగాడు అల్లుడు (బెల్లంకొండ)  శ్రీనివాస్. వరుసగా సరైన హిట్ సినిమా లేకపోయినా 'రాక్షసుడు' లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా అల్లుడు అదుర్స్ సినిమాతో ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ ఇవ్వాలనే ప్రయత్నం చేశాడు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన నభా నటేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా నటించారు.  కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ కథ ఎలా ఉంది? కథనం ఎలా సాగింది? నటీనటుల పనితీరు తదితర విశేషాలు ఈ రివ్యూలో చూద్దాం.

కథ :

శ్రీను( బెల్లం కొండ శ్రీనివాస్ ) చిన్నప్పుడే వసుందర ( అను ఇమాన్యుల్ )ను ప్రేమిస్తాడు. కాని ఆమె మాత్రం ఇతన్ని ఇష్టపడదు. తన తొలి ప్రేమ విఫలం అవడంతో శ్రీను ఇక అమ్మాయిలకు దూరంగా ఉండాలనుకుంటాడు. కానీ పెద్దవాడైన తర్వాత  కౌముది ( నభనటేష్ )తో మరోసారి ప్రేమలో పడతాడు.ఇదే సమయంలో శ్రీను జీవితంలోకి గజా( సోనూసూద్ ) అడుగు పెడతాడు. మరోవైపు తన ప్రేమను దక్కించుకునే క్రమంలో కౌముది తండ్రి జైపాల్ రెడ్డి (ప్రకాష్ రాజ్)తో ఓ ఒప్పందానికి రావాల్సి వస్తుంది.అసలు శ్రీను చేసుకున్న ఒప్పందమేంటి? ఈ గజా ఎవరు ? అతనికి వసుంధరకి సంబంధం ఏమిటీ ? చివరకు శ్రీను తన ప్రేమను ఎలా గెలుచుకున్నాడు ? అనేదే మిగత కథ.

నటి నటుల హావభావాలు :

శ్రీను పాత్రలో బెల్లంకొండ శ్రీనివాస్ లుక్స్ అండ్ ఫిజిక్ పరంగా చాలా ఫిట్ గా బాగున్నాడు. పైగా గతంలో కంటే పరిణతి చెందిన తన నటనతో ఆకట్టుకుంటూ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ముఖ్యంగా ఆయన రిస్క్ చేసి మరి చేసిన యాక్షన్ సీన్స్ లోని అడ్వంచరస్ బాగున్నాయి. ఇక హీరోయిన్ గా నటించిన నభా నటేష్ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో గ్లామర్ తో ఈ చిత్రానికి స్పెషల్ ఎట్రాక్షన్ లా నిలిచింది .ప్రకాష్ రాజ్, ఇంద్రజ, సోనూసూద్ లాంటి మంచి నటులు ఈ చిత్రంలో తమ పాత్రలను అద్భుతంగా పోషించి ఈ చిత్రాన్ని నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఇక వెన్నెల కిషోర్ తన కామెడీ టైమింగ్ తో అక్కడక్కడ నవ్విస్తాడు. అలాగే ఎక్కువ సేపు కనిపించకపోయిన కీలక పాత్రలో నటించిన అను ఇమాన్యుల్ తన నటనతో ఆకట్టుకుంది.  కమెడియన్స్ శ్రీనివాస్ రెడ్డి, సత్య, చమ్మక్ చంద్ర రోల్స్ కామెడీ పార్ట్‌ సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయి. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలపరిధి మేరకు నటించారు.

సాంకేతిక వర్గం పనితీరు :

కథనంలో ఎక్కడా కామెడీని మిస్ కాకుండా నడిపించారు డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్. సినిమా చూస్తున్నంత సేపు డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ గత సినిమా అయిన 'కందిరీగ' సినిమానే గుర్తుకొస్తూ ఉంటుంది. ఆ సినిమాలో ఎలాగైతే కన్ఫ్యూజింగ్ హౌస్ కామెడీని హైలైట్ చేశారో ఇందులో కూడా అదే రిపీట్ చేశారు. కాన్సెప్ట్‌లో కొత్తదనం లేకున్నా డిఫరెంట్ నెరేషన్‌తో సినిమా ఆసక్తి రేకెత్తించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. కందిరీగ సినిమాలో ఎలాగైతే కన్ఫ్యూజింగ్ హౌస్ కామెడీని హైలైట్ చేశారో ఇందులో కూడా అదే రిపీట్ చేశారు. కాన్సెప్ట్‌లో కొత్తదనం లేకున్నా డిఫరెంట్ నెరేషన్‌తో సినిమా ఆసక్తి రేకెత్తించే ప్రయత్నం చేశాడు.సినిమా ఇంట్రస్ట్ గా మొదలైనప్పటికీ, ఆ ఇంట్రస్ట్ ను దర్శకుడు చివరి వరకు నిలబెట్టలేకపోయాడు. మ్యూజిక్ డైరెక్టర్‌ దేవిశ్రీ ప్రసాద్  అందించిన అందించిన రీరికార్డింగ్ సినిమాని మరో స్థాయికి తీసుకువెళ్ళింది, సౌండ్, పాటల్లోని కొన్ని బిట్స్ చాలా బాగున్నాయి. రామ్ లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి. ప్రతీ ఫైట్ క్లైమాక్స్ ఫైట్ లానే ఉంటుంది. సినిమాటోగ్రఫర్ చోటా కె. నాయుడు సినిమాలో దృశ్యాలన్నీ చాలా అందంగా చూపించారు. ఎడిటర్  తమ్మిరాజు వర్క్  బాగున్నా, సెకండ్ హాఫ్ లోని సాగతీత సీన్లను కొంత ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. సినిమాలోని పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి.

విశ్లేషణ:

రెగ్యులర్ పాయింట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం చివరకి ఓ రొటీన్ కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ గానే సాగుతూ బోర్ కొడుతోంది. అయితే, సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు, పాత్రల నటన, వారి మధ్య కొన్ని కామెడీ సన్నివేశాలు బాగున్నాయి. కానీ, సినిమాలో కొత్తదనం లేకపోవడం, అక్కడక్కడ కొన్ని దృశ్యాలు పాత సినిమాలను గుర్తుకుచేయడం, అలాగే బోరింగ్ ట్రీట్మెంట్ సినిమా రిజల్ట్ ను దెబ్బ తీసింది. ఓవరాల్ గా ఈ చిత్రంలోని కొన్ని అంశాలు బి.సి సెంటర్స్ ప్రేక్షకులకు కనెక్ట్ అయినా, సిల్లీ సినిమాగా అనిపిస్తుంది.  

 

Tags :