తెలంగాణలో అమరరాజా గ్రూప్ భారీ పెట్టుబడి

తెలంగాణలో అమరరాజా గ్రూప్ భారీ పెట్టుబడి

తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు అమరరాజా సంస్థ ముందుకొచ్చింది. మహబూబ్‌నగర్‌ జిల్లా దివిటిపల్లిలో విద్యుత్‌ వాహనాల బ్యాటరీల తయారీ  యూనిట్‌ను నెలకొల్పనున్నట్లు అమరరాజ గ్రూప్‌ ప్రకటిచింది. ఈ మేరకు అమరరాజా సంస్థ తెలంగాణ ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. రాష్ట్రంలో లిథియం అయాన్‌ గిగా ఫ్యాక్టరీ నెలకొల్పనుంది. రాష్ట్రంలో రూ.9,500 కోట్ల పెట్టుబడులు పెట్టడంతో పాటు  4,500 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు అమరరాజ గ్రూప్‌ ప్రకటించిది. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌, అమరరాజ గ్రూప్‌ డైరెక్టర్‌ గల్లా జయదేవ్‌, ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేష్‌ రంజన్‌, టీఫైబర్‌ ఎండీ, సీఈఓ సంజయ్‌, ఇతర ఉన్నతాధికారులు  పాల్గొన్నారు.

 

Tags :