అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం

అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం

మంచుకొండల్లో కొలువైన పరమశివుడి దర్శనం కోసం వార్షిక అమర్‌నాథ్‌ యాత్రకు తొలి అడుగు పడింది. జమ్ము నుంచి కశ్మీర్‌లోని పహల్‌గామ్‌, బాల్తవ్‌ బేస్‌ క్యాంపులకు 4,890 మంది యాత్రికులు బయలుదేరారు. వీరి వాహనాలను జమ్ము కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా జెండా ఊపి ప్రారంభించారు. యాత్రికులు పహల్‌గామ్‌, బాల్తల్‌ బేస్‌ క్యాంపుల నుంచి బయలుదేరి మంచి శివుడిని దర్శించుకుంటారు. రక్షా బంధన్‌ రోజున (ఆగస్టు 11న) యాత్ర ముగుస్తుంది. కరోనా వల్ల గత రెండేండ్లపాటు అమర్‌నాథ్‌ యాత్ర నిలిచిన విషయం తెలిసిందే.

 

Tags :