అమెజాన్ చరిత్రలో ఇదే తొలిసారి...లక్ష మందిని

అమెజాన్ చరిత్రలో ఇదే తొలిసారి...లక్ష మందిని

ప్రముఖ ఆన్‌లైన్‌ ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ లక్ష మంది ఉద్యోగులను తొలగించనుందని తెలుస్తోంది. ఆర్థిక మాంధ్యం భయాల కారణంగా ఖర్చులు తగ్గించేందుకుకు ఇప్పటికే పలు కంపెనీలు భారీ సంఖ్యలో ఉద్యోగులను తగ్గిస్తున్నాయి. అమెజాన్‌ చరిత్రలో తొలిసారి ఇంత భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించిదని వార్తలు వస్తున్నాయి. అమెజాన్‌ వార్షిక ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఆ సంస్థ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారి బ్రియాన్‌ ఒల్సా వ్స్కీ ఈ విషయంలో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అమెజాన్‌లో పని చేస్తున్న మొత్తం సిబ్బంది 15 లక్షల మందిలో లక్ష వరకు విధుల నుంచి తొలగించనున్నట్లు ప్రకటించారు. వీరిలో ఫుల్‌ఫిట్‌మెంట్‌, సెంటర్‌, డిస్టిబ్యూషన్‌ నెట్‌వర్క్‌ ఉద్యోగులు ఎక్కువగా ఉన్నాయి. కొత్తగా సిబ్బందిని నియమించుకోవడాన్ని కూడా తగ్గిస్తున్నట్లు తెలిపారు.

 

Tags :