మే 20న అమెజాన్ ప్రైమ్‌లో చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ ల 'ఆచార్య'

మే 20న అమెజాన్ ప్రైమ్‌లో చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ ల  'ఆచార్య'

మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కులుగా స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ తెర‌కెక్కించిన చిత్రం ‘ఆచార్య’. ఈ సినిమా మే 20న అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌ల కానుంది.మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కులుగా స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ తెర‌కెక్కించిన చిత్రం ‘ఆచార్య’. కొణిదెల ప్రొడక్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 29న విడుద‌లైంది. తండ్రీ కొడుకులు చిరంజీవి - రామ్ చ‌ర‌ణ్ తొలిసారి పూర్తి స్థాయి పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం కావ‌డంతో పాటు ఫెయిల్యూర్స్ లేని కొర‌టాల శివ తెర‌కెక్కించిన చిత్రం కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. అయితే సినిమా ఈ అంచ‌నాల‌ను అందుకోవ‌డంలో స‌క్సెస్ కాలేదు. మెగాభిమానుల‌కు నిరాశ‌ను మిగిల్చిన చిత్రంగా ఆచార్య మిగిలిపోయాడు.

సినిమా ఆశించిన స్థాయిలో స‌క్సెస్ అయ్యుంటే ఓటీటీలో కాస్త ఆల‌స్యంగా సినిమా రిలీజ్ అయ్యుండేది. కానీ అలా కాక‌పోవ‌టంతో ‘ఆచార్య’ ముందుగా ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది. రీసెంట్‌గా సోష‌ల్ మీడియాలో మే 20న ‘ఆచార్య’ ఓటీటీ రిలీజ్ ఉండొచ్చునంటూ వార్త‌లు వ‌చ్చాయి. ఆ వార్త‌లు నిజ‌మ‌య్యాయి. మే 20నే ‘ఆచార్య’ ప్ర‌ముఖ డిజిట‌ల్ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అవుతుంది. కొన్ని సినిమాలు థియేట‌ర్స్‌లో మెప్పించ‌క‌పోయినా బుల్లితెర‌, డిజిట‌ల్ మాధ్య‌మాల్లో ఆక‌ట్టుకున్నాయి. మ‌రి ఆ సినిమాల కోవ‌లో ఈ సినిమా కూడా నిలుస్తుందేమో చూడాలి. ధ‌ర్మ‌స్థ‌లి అనే స్థ‌లం.. దానిపై ప్ర‌తినాయ‌కుడు క‌న్నేసి ఆక్ర‌మించుకోవాల‌నుకుంటాడు.. దానికి క‌థానాయ‌కుడు ఆచార్య అడ్డుగా నిలుస్తాడు. అత‌నికి సిద్ధ అనే యువ‌కుడికి ఉన్న రిలేష‌న్ ఏంటి? అనే కోణంలో ‘ఆచార్య’ సినిమా సాగుతుంది. ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ జోడీగా పూజా హెగ్డే న‌టించింది. మ‌ణిశ‌ర్మ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. సినిమా కోసం శంక‌ర్ ప‌ల్లిలో భారీ టెంపుల్ సెట్‌ను వేసి మ‌రీ చిత్రీక‌రించారు. ఓ క‌మ‌ర్షియ‌ల్ పంథాలో ప్రేక్ష‌కుల‌ను ఆట్టుకుంటుంద‌ని అంద‌రూ భావించిన‌ప్ప‌టికీ సినిమా సక్సెస్ కాలేదు.

 

 

Tags :