ఏపీలో యాంబర్ ఇండియా సంస్థ రూ.250 కోట్ల పెట్టుబడులు

ఏపీలో యాంబర్ ఇండియా సంస్థ రూ.250 కోట్ల పెట్టుబడులు

ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ భారత దేశంలో ఏసీల తయారీ కేంద్రంగా నిలుస్తోంది. దేశంలోని 20కి పైగా కంపెనీలకు సరఫరా చేసే యాంబర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థ రాష్ట్రంలో తయారీ యూనిట్‌కు భూమిపూజ చేసింది. చిత్తూరు జిల్లా శ్రీసిటీలో 16.3 ఎకరాల్లో సుమారు రూ.250 కోట్లతో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. రూమ్‌ ఎయిర్‌ కండిషనర్లు, విడిభాగాలు తయారీలో  పేరుగాంచిన యాంబర్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ ఇండియా లిమిటెడ్‌కు ఇది దేశంలో 15వ ప్లాంట్‌ కాగా దక్షిణాదిన తొలి యూనిట్‌. శ్రీసిటీ ద్వారా దక్షిణ భారతదేశ క్లయింట్లకు ఉత్పత్తులను అందించనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఎల్‌జీ, కారియల్‌, హిటాచీ, ఫ్లిప్‌కార్ట్‌..  అమెజాన్‌ వంటి 20కి పైగా ప్రముఖ కంపెనీలకు ఉత్పత్తులను యాంబర్‌ అందిస్తుంది. ఈ యూనిట్‌ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 2 వేల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపింది.

 

Tags :