ఆ నిర్ణయంపై భారత్ పునరాలోచన : అమెరికా

గోధమ ఎగుమతులపై విధించిన నిషేధంపై భారత్ పునరాలోచిస్తుందని ఆశిస్తున్నట్లు అమెరికా ప్రతినిధి లిండా థామన్ గ్రీన్ ఫీల్డ్ పేర్కొన్నారు. దేశంలో నిత్యావసర ధరలను నియంత్రించే ఉద్దేశంతో గోధమ ఎగుమతులపై నిషేధం విధిస్తూ గత వారం భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వెంటనే అమలులోకి వస్తుందని పేర్కొంది. అయితే భారత్ తీసుకున్న నిర్ణయం వల్ల తమ దేశంలో గోధుమ కొరత ఏర్పడుతుందని, ఈ నిర్ణయంపై భారత్ పునరాలోచిస్తుందని ఆశిస్తున్నట్టు న్యూయార్క్‌లోని గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పేర్కొన్నారు. ఈ నిర్ణయంపై పునరాలోచిస్తారని ఆశిస్తున్నామని అన్నారు.
Tags :