ఉత్తర కొరియాపై అమెరికా ఆంక్షలు

ప్రపంచ దేశాల హెచ్చరికలు, సూచనలను పట్టించుకోకుండా వరుస క్షిపణి పరీక్షలు నిర్వహిస్తున్న ఉత్తర కొరియాపై అమెరికా, జపాన్, దక్షిణి కొరియా మరిన్ని ఆంక్షలు విధించాయి. జోన్ ఇల్ హు, యు జిన్, కిమ్ సు గిల్ పై నిషేధం విధిస్తూ అమెరికా ట్రెజరీ విభాగం ఆదేశాలు జారీ చేసింది. సామూహిక విధ్వంసక ఆయుధాల అభివృద్ధిలో వీరిద్దరూ కీలక పాత్ర పోషించారని పేర్కొంది. దక్షిణ కొరియా, జపాన్ కూడా కొత్తగా ఆంక్షలు విధించాయి. నవంబరు 18న ఉత్తర కొరియా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (ఐసీబీఎం) ని ప్రయోగించిన నేపథ్యంలో అమెరికా, దాని మిత్రదేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.
Tags :