అనాథ బాలుడిని దత్తత తీసుకున్న.. అమెరికా దంపతులు

అనాథ బాలుడిని దత్తత తీసుకున్న.. అమెరికా దంపతులు

మూడేళ్ల వయసులోనే అమ్మ చనిపోయింది. అప్పటికే నాన్న ఎక్కడికో వెళ్లిపోయాడు. అమ్మ మృతదేహం వద్ద ఆ బాలుడు రోదిస్తున్న దృశ్యం అందరినీ కలచివేసింది. రెండేళ్ల క్రితం సంగారెడ్డి శిశుగృహ అధికారులు ఆ బాలుడిని అక్కువ చేర్చుకున్నారు. అంతా బాగుందనుకుంటున్న తరుణంలో ఆ బాలుడికి దీర్ఘకాలిక జబ్బు ఉన్నట్లు బయటపడింది. అయినా అధికారులు వైద్యం చేయిస్తూ కంటికి రెప్పలా కాడుతున్నారు. ఈ స్థితిలో బాలుడికి మరో పెద్ద అండ దొరికింది. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలను దత్తత తీసుకోవాలని చూస్తున్న అమెరికాకు చెందిన ప్రముఖ వైద్యుడు స్టీఫెన్‌ పాట్రిక్‌ బెర్గిన్‌ సంబంధిత ఏజెన్సీల నుంచి వివరాలు సేకరించి ఈ బాలుడిని ఎంచుకున్నారు.

దత్తత తీసుకోడానికి అవసరమైన అన్ని నిబంధనలు పూర్తి చేశారు. ఆమోదం లభించినప్పటికి ఆ బాలుడితో వీడియోకాల్‌లో మాట్లాడుతున్నారు. మందులతో పాటు బొమ్మలూ పంపుతూ అనుబంధం పెంచుకున్నారు. ఆ బాలుడిని తీసుకెళ్లడానికి తన భార్య ఎరిన్‌ లిన్‌ బెర్గిన్‌తో కలిసి వచ్చారు. వారిని చూడగానే బాలుడు అమ్మనాన్నా అంటూ వెళ్లి వారిని హత్తుకున్నాడు. అడిషనల్‌ కలెక్టర్‌ రాజర్షిషా, జిల్లా సంక్షేమాధికారిణి పద్మావతి సమక్షంలో దత్తత పత్రాలు అందుకున్న ఈ దంపతులు తమతో పాటు అమెరికా తీసుకెళ్లడానికి సిద్దమయ్యారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ ఈ బాలుడిని దత్తత తీసుకునేందుకు ముందుకు రావడం వివేషం.

 

Tags :