ఆటా గోల్ఫ్ టోర్నమెంట్ విజయవంతం

ఆటా గోల్ఫ్ టోర్నమెంట్ విజయవంతం

అమెరికన్‍ తెలుగు అసోసియేషన్‍ (ఆటా) ఆధ్వర్యంలో గోల్ఫ్ టోర్నమెంట్‍ విజయవంతమైంది. ఆగస్టు 28న వర్జీనియాలోని గైన్స్విల్లే, స్టోన్‍వాల్‍ గోల్ఫ్ క్లబ్‍లో జరిగిన ఈ టోర్నమెంట్‍లో పలువురు ఆటగాళ్ళు పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు. దాదాపు 28 టీమ్‍లు ఇందులో పాల్గొన్నాయి. కిషోర్‍ చెన్నుపాటీ టీమ్‍కు చెందిన దినకర్‍ కుడుం, రిషి సుందరేషన్‍, సుందువెంకట్రమణి 58 టైబ్రేక్‍తో మొదటివరుసలో నిలిచారు. చంద్ర ద్యామన్‍గౌడర్‍, అనుప్‍గుప్తా, సమీష్‍ చావ్లా, ప్రకాష్‍ కృష్ణమూర్తి సెకండ్‍లైన్‍లో నిలిచారు. కరణ్‍ చిలుకూరు టీమ్‍కు చెందిన శశి రంగనాథన్‍, దురై నటరాజన్‍, వికాక్‍ కాలే ఫస్ట్ ప్లైట్‍2లో 68 టైబ్రేక్‍తో నిలిచారు. సెకండ్‍ ప్లేస్‍లో బాల పెరుంబాల టీమ్‍కు చెందిన క్రిష్‍ రామయ్య కృష్ణమూర్తి, గోవింద్‍ జగన్నాథన్‍, సుందర్‍ నిలిచారు. సుందు వెంకట్రమణి, సకీత్‍ వెమ్నూరి, విక్రమ్‍, చంద్ర ద్యామన్‍గౌడర్‍ విజేతలుగా నిలిచారు.

ఆటా అధ్యక్షుడు భువనేష్‍ బూజాల విజేతలను అభినందించి, ఈ టోర్నమెంట్‍ను విజయవంతం చేసిన ప్రతి టీమ్‍కు ధన్యవాదాలు తెలిపారు. వచ్చే సంవత్సరం జూలైలో 1,2,3 తేదీల్లో వాషింగ్టన్‍ డీసీలోని వాల్టర్‍ ఇ కన్వెన్షన్‍ సెంటర్‍లో నిర్వహించే ఆటా మహాసభల్లో పాల్గొనాల్సిందిగా క్రీడాకారులను ఆహ్వానించారు. ఆటా డీసి కాన్ఫరెన్స్ కన్వీనర్‍ సుధీర్‍ బండారు, కో కో ఆర్డినేటర్‍ రవి చల్లా కూడా టోర్నమెంట్‍ నిర్వహణకు సహకరించిన వలంటీర్లకు, స్పాన్సర్స్ సోమిరెడ్డి లా ఫర్మ్, సురేష్‍ సరిబాల, సురేందర్‍ ఎదుల్ల, విజయ్‍ ఖేతర్‍పాల, లార్డస్ మైఖెల్‍ తదితరులకు ధన్యవాదాలు తెలియజేశారు.

 

Tags :