మళ్లీ ఆంక్షల వలయంలోకి న్యూయార్క్

మళ్లీ ఆంక్షల వలయంలోకి న్యూయార్క్

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ క్రమంగా ప్రపంచ దేశాలను చుట్టేస్తోంది. చాపకింద నీరులా విస్తరిస్తున్న ఈ వేరియంట్కు అడ్డుకట్ట వేసేందుకు చాలా వరకు దేశాలు ఆంక్షల వలయంలోకి వెళ్లిపోతున్నాయి. మరీ ముఖ్యంగా అమెరికాలోని న్యూయార్క్లో ఒమిక్రాన్ కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతండడం ఆందోళనకు గురి చేస్తోంది. దీంతో మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేయాలని యోచిస్తున్నట్టు న్యూయార్క్ గవర్నర్ కాథిహోచుల్ తెలిపారు. కరోనా తొలి దశలో మాస్కులు వాడకాన్ని తప్పనిసరి చేసిన అమెరికా ప్రభుత్వం ఆ తర్వాత కొంత సడలించింది. టీకా తీసుకున్న వారు మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఇప్పుడు ఒమిక్రాన్ భయం వెంటాడుతుండడంతో మళ్లీ అందరికీ మాస్కులు తప్పనిసరి చేయాలని యోచిస్తోంది. అయితే, కేసులు ఆసుపత్రుల్లో చేరుతున్నవారి సంఖ్యను బట్టి నిర్ణయం తీసుకుంటామని గవర్నర్ తెలిపారు.

 

Tags :