సినిమా రివ్యూ : కల్యాణ్ రామ్ ఖాతాలో మరో హిట్ 'అమిగోస్'

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.75/5
నిర్మాణ సంస్థ: మైత్రి మూవీ మేకర్స్
నటీనటులు : నందమూరి కళ్యాణ్ రామ్, నందమూరి కళ్యాణ్ రామ్, నందమూరి కళ్యాణ్ రామ్, ఆషికా రంగనాథ్, బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు
ఛాయాగ్రహణం : ఎస్. సౌందర్ రాజన్, సంగీతం : జిబ్రాన్
నిర్మాతలు : నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి
రచన, దర్శకత్వం : రాజేంద్ర రెడ్డి
విడుదల తేదీ: 10.02.2023
సెల్యులాయిడ్ సైన్సెస్ట్ గా పేరొందిన నందమూరి కళ్యాణ్ రామ్ త్రి పాత్రాభినయం చేసిన సినిమా 'అమిగోస్'. 'బింబిసార' విజయం తర్వాత విడుదలైన చిత్రమిది. బాక్సాఫీస్ బరిలో 2023 సంక్రాంతికి 'వీర సింహా రెడ్డి', 'వాల్తేరు వీరయ్య' సినిమాలతో బ్లాక్ బస్టర్స్ నమోదు చేసిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నుంచి వస్తున్న తాజా చిత్రమిది. అయిదు, మూడు పాత్రల్లో చేసిన సీనియర్ యన్టీర్, లవకుశలో మూడు పాత్రల్లో చేసిన జూనియర్ ఎన్టీర్ లను కళ్యాణ్ రామ్ మరిపించారా? ఎలా చేశారు? సినిమా ఎలా ఉంది ? సమీక్షలో చూద్దాం.
కథ:
సిద్ధార్థ్ (నందమూరి కళ్యాణ్ రామ్) హైదరాబాద్ యువకుడు తమ ఫ్యామిలీ బిజినెస్ చూసుకుంటాడు. ఇషిక (ఆషికా రంగనాథ్) మీద మనసు పారేసుకున్నాడు. ప్రేమించిన అమ్మాయిని పెళ్ళాడాలని ప్రయత్నాలు చేస్తాడు. ఇరు కుటుంబాలు ఒప్పుకోవడంతో సిద్దూ, ఇషికా నిశ్చితార్థం కూడా జరిగిపోతుంది. ఓ వెబ్సైట్ ద్వారా తన పోలికలతో మరో (Doppelganger) ఇద్దరు వ్యక్తులను గుర్తించితెలుసుకుని, బిపిన్ రాయ్ (నందమూరి కళ్యాణ్ రామ్) అలియాస్ మైఖేల్ గ్యాంగ్ స్టార్ గా, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పాత్రలో మంజునాథ్ హెగ్డే (నందమూరి కళ్యాణ్ రామ్)లను సిద్ధార్థ్ కలుస్తాడు. ముగ్గురూ క్లోజ్ అవుతారు. బెంగళూరు వెళ్లాలని మంజునాథ్, కలకత్తా వెళ్లాలని మైఖేల్... ఎవరి ఊరికి వారు బయలు దేరతారు. అంతకు ముందు హైదరాబాదులో ఎన్ఐఏ అధికారిని బిపిన్ అలియాస్ మైఖేల్ చంపేస్తాడు. ఆ మర్డర్ కేసు నుంచి తాను తప్పించుకుని సిద్ధార్థ్ అరెస్ట్ అయ్యేలా ప్లాన్ చేస్తాడు. బిపిన్ అనుకుని ఎన్ఐఏ ఎవరిని అరెస్ట్ చేసింది? ఆ తర్వాత ఏమైంది? నరరూప రాక్షసుడు లాంటి బిపిన్ వేసిన అసలు ప్లాన్ ఏంటి? అతడి నుంచి సిద్ధార్థ్, మంజునాథ్ తప్పించుకున్నారా? లేదా? అనేది మిగతా సినిమా.
నటీనటుల హావభావాలు:
'అమిగోస్'లో కళ్యాణ్ రామ్ మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్ లో కనిపించాడు పర్ఫామెన్స్ విషయానికి వస్తే పాజిటివ్, నెగిటివ్ పాత్రల్లో హీరో కమ్ విలన్ గా కళ్యాణ్ రామ్ అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా గ్యాంగ్ స్టార్ పాత్రలో మైకేల్ మిగిలిన ఇద్దరినీ తనకు అనుకూలంగా వాడుకునే ప్రయత్నం చేస్తాడు. అందులో ఒకరు విలన్. ముందు మిగతా ఇద్దరితో స్నేహం చేసి... ఆ తర్వాత వాళ్ళను చంపాలని చూస్తారు. యాక్టింగ్ మరియు యాటిట్యూడ్ పరంగా మూడు పాత్రల్లో కళ్యాణ్ రామ్ వేరియేషన్ కనపర్చారు. నెగెటివ్ షేడ్స్ ఉన్న బిపిన్ రాయ్, మైఖేల్ పాత్రలో నటన, వాయిస్ మాడ్యులేషన్ ఆకట్టుకుంటాయి. నటనాపరంగా ఈ విషయంలో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఓ రెండు మెట్లు ఎక్కారు అని చెప్పొచ్చు. ఆషికా రంగనాథ్ స్క్రీన్ ప్రజెన్స్ బావుంది. అమ్మాయిగా అనుష్క లా కనిపించింది. కానీ, ఇక ఈ సినిమాకు హీరోయిన్ ఆషిక గ్లామర్ బాగా ప్లస్ అయింది. ఆమె నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. బ్రహ్మాజీ, సప్తగిరికి నవ్వించే అవకాశం దర్శకుడు ఇవ్వలేదు. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు చేశారు.
సాంకేతికవర్గం పనితీరు:
సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. దర్శకుడు రాజేంద్ర రెడ్డి మైత్రి మూవీ మేకర్ సంస్థలో నిర్మించే చిత్రాలకు స్క్రిప్ట్ వర్క్ చేస్తుంటారు. దర్శకుడిగా అతను సెలెక్ట్ చేసుకున్న కాన్సెప్ట్ బావుంది. కానీ కథ, కథనాలు కోసం ఎత్తుకొన్న ఎత్తుగడ కరెక్ట్‌గా లేదనే చెప్పాలి. మూడు పాత్రలను బలంగా రాసుకోలేకపోవడం ఒక మైనస్‌గా చెప్పుకోవాలి. సౌందర రాజన్ సినిమాటోగ్రఫి బాగుంది. యాక్షన్ సీన్లను బాగా చిత్రీకరించాడు. మ్యూజిక్ విషయానికి వస్తే 'ఎన్నో రాత్రులొస్తాయి గానీ...' సాంగ్ రీమిక్స్ వినడానికి, స్క్రీన్ మీద చూడటానికి బావుంది. పాటకు వేసిన ఆర్ట్ వర్క్ బాగుంది. మైత్రీ మూవీ మేకర్స్ అంటే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి.
విశ్లేషణ:
మనిషిని పోలిన మనుషులు అనే కొత్త కాన్సెప్ట్‌తో యాక్షన్, డ్రామాగా అమిగోస్ రూపొందింది. దర్శకుడు ఆలోచించిన పాయింట్ బాగుంది. కానీ కథను విస్తరించడంలో తడబాటు కనిపిస్తుంది. అవుట్ అండ్ అవుట్ కల్యాణ్ రామ్ ఫెర్ఫార్మెన్స్ సినిమాకు హైలెట్ నిలుస్తుంది. నందమూరి ఫ్యాన్స్‌కు నచ్చే అంశాలు బాగున్నాయి. అయితే, స్టార్టింగ్ టు ఎండింగ్ 'నెక్స్ట్ సీన్‌కు త్వరగా రా' అనేలా ఉంది. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అవకాశాలను బట్టి సినిమా కమర్షియల్ రేంజ్ తెలుస్తుంది.