MKOne TeluguTimes-Youtube-Channel

సెల్యులాయిడ్ సైన్సెస్ట్ నందమూరి కళ్యాణ్ రామ్ 'అమిగోస్' చిత్రంపై ట్విట్టర్ రివ్యూస్  

సెల్యులాయిడ్ సైన్సెస్ట్ నందమూరి కళ్యాణ్ రామ్ 'అమిగోస్' చిత్రంపై ట్విట్టర్ రివ్యూస్  

ఈ రోజు (ఫిబ్రవరి 10) శుక్ర‌వారం నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ అమిగోస్ సినిమా థియేట‌ర్స్‌లో సంద‌డి చేసింది. సినిమాను చూసిన ఆడియెన్స్ త‌మ స్పంద‌న‌ను సోష‌ల్ మీడియాల్లో తెలియ‌జేస్తున్నారు. త‌న‌కంటూ సెప‌రేట్ ఇమేజ్‌ను సంపాదించుకున్నారు హీరో క‌ళ్యాణ్ రామ్‌. అందులో భాగంగానే ఆయ‌న గ‌త ఏడాది బింబిసార వంటి డిఫరెంట్ మూవీతో బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించారు. ఇప్పుడు అమిగోస్ అంటూ ప‌ల‌క‌రించ‌టానికి రెడీ అయ్యారు. ఇందులో ఆయ‌న త్రిపాత్రాభిన‌యం చేయ‌టం విశేషం. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన‌ర్‌పై రాజేంద్ర రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్ ఈ సినిమాను నిర్మించారు. శాండిల్ ఉడ్ బ్యూటీ ఆషికా రంగ‌నాథ్ హీరోయిన్‌గా న‌టించింది. ఇంత‌కీ అమిగోస్ అంటే స్పానిష్ ప‌దం. ఫ్రెండ్స్‌ను సూచించ‌టానికి ఉప‌యోగించే పేరు. మ‌రి ఈ ‘అమిగోస్’ క‌ళ్యాణ్ రామ్‌కు మ‌రో హిట్‌ను అందించిందో లేద‌నేది ఆడియెన్స్ సోష‌ల్ మీడియాల ద్వారా త‌మ స్పంద‌న‌ను తెలియ‌జేస్తున్నారు.

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ న‌ట‌న అద్బుతంగా ఉందంటూ కొంద‌రు నెటిజ‌న్స్ అంటున్నారు. ముఖ్యంగా మైఖేల్ పాత్ర‌లో సూప‌ర్బ్ యాక్టింగ్ అని కామెంట్స్ పెడుతున్నారు. ద‌ర్శ‌కుడు రాజేంద్ర రెడ్డి సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించార‌ని అప్రిషియేట్ చేస్తున్నారు. ఇక జిబ్రాన్ సంగీతం మేజ‌ర్ ఎసెట్ అని అంటున్నారు. గుడ్ మూవీ విత్ డిఫరెంట్ కాన్సెప్ట్ అనినందమూరి కళ్యాణ్ రామ్ తన పెర్ఫామెన్స్‌తో మెరిశాడని, ఆషికా రంగనాథ్ అందంగా ఉందని పాటలు, బ్యా గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన బలంగా ఉన్నాయని మరికొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియాలోని నందమూరి ఫ్యాన్స్ అయితే నందమూరి కళ్యాణ్ రామ్ మరో బ్లాక్ బస్టర్ సాధించాడని చెబుతూ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌కి అభినందనలు తెలిపారు. కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ, ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ విజయవంతం అవ్వటం ఒక్క నందమూరి కళ్యాణ్ రామ్‌కే చెల్లింది.. ఒక అతనొక్కడే అయిన, ఒక పటాస్ అయిన, ఒక బింబిసార అయిన..ఇప్పుడు అమిగోస్ అయిన.. అద్భుతం.. కళ్యాణ్ రామ్ అంటూ అమిగోస్ బ్లాక్ బస్టర్ అంటూ మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

 

 

Tags :