తెలంగాణ బీజేపీ నేతలకు అమిత్ షా చురకలు.. మరింత కష్టపడాలని సూచన

తెలంగాణ బీజేపీ నేతలకు అమిత్ షా చురకలు.. మరింత కష్టపడాలని సూచన

విమోచన దినోత్సవం వేడుకల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. తెలంగాణలోని బీజేపీ నేతలకు చురకలంటించారు. కొద్ది సేపటి క్రితం ముగిసిన బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో ఆయన పార్టీ శ్రేణులపై అసహనాన్ని ప్రదర్శించినట్లు తెలుస్తోంది. సుమారు గంటన్నరపాటు జరిగి. ఈ సమావేశం వాడి వేడిగా సాగినట్లు సమాచారం. జాతీయ నాయకత్వం పెట్టుకున్న అంచనాలను రాష్ట్ర కార్యవర్గం ఏమాత్రం అందులేకపోతోందని పార్టీ నేతలపై అమిత్ షా అసహనం ప్రకటించారని తెలుస్తోంది. పార్టీ నేతల్లో ఐక్యత కొరవడినట్లు తనకు సమాచారం అందినట్లు చెప్పిన ఆయన నేతలపై ఫైర్ అయ్యారట. ప్రజల్లో బీజేపీ పట్ల ఆసక్తి కనబడుతోందని, కానీ నాయకులు దాన్నుంచి లబ్ది పొందడంలో విఫలం అవుతున్నారని అక్కసు వెళ్లగక్కిన అమిత్ షా.. నేతలు‌ ఇంకా కష్టపడితేనే ఫలితం ఉంటుందని హితబోధ చేశారట. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి‌ సంజయ్ పాదయాత్రకు స్పందన బాగుందని, మిగతా నేతలు కూడా ప్రజల్లో ఉండాలని ఆయన సూచించారు. అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎక్కడికక్కడ ఎండగడుతూ మరింత దూకుడుగా ముందుకు వెళ్ళాలని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికపై మరింత ఫోకస్ పెంచాలని ఆదేశించారు. ఉప ఎన్నిక‌ కోసం త్వరలో పార్టీ తరపున కమిటీ వేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ క్రమంలోనే క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై తెలంగాణ బీజేపీ నేతలకు అమిత్ షా కొన్ని కీలకమైన సలహాలు, సూచనలు ఇచ్చారు.

 

Tags :