ఒక్క ఆధారం చూపినా రాజీనామా చేస్తా

ఒక్క ఆధారం చూపినా రాజీనామా చేస్తా

ఉత్తరప్రదేశ్‌లోని లఖీమ్‌పుర్‌ ఖేరీలో రైతు మరణాల ఘటనపై కేంద్ర మంత్రి  అజయ్‌ మిశ్రా స్పందించారు. తన కుమారుడు అశిష్‌ మిశ్రా ఈ ఘనటలో ఉన్నట్లు ఒక్క ఆధారం చూసిన కేంద్ర మంత్రి పదవికీ రాజీనామా చేస్తానని అన్నారు. కారు అదుపు తప్పి రైతుల పైకి దూసుకెళ్లిందని, ఈ ఘటన సమయంలో కారులో తన కుమారుడు లేడని అన్నారు. ఘటన తర్వాత కారుపై దాడి చేయడంతో డ్రైవర్‌ గాయపడ్డారని తెలిపారు. లఖీమ్‌పూర్‌ ఖేరీ ఘటనపై నిరాధారణ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. రైతులకు వ్యతిరేకంగా బీజేపీ అధిష్టానం తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని స్పష్టం చేశారు.

 

Tags :