తెలుగు రాష్ట్రాల్లో గిరిజన స్వాతంత్ర పోరాట యోధుల మ్యూజియాలు

తెలుగు రాష్ట్రాల్లో గిరిజన స్వాతంత్ర పోరాట యోధుల మ్యూజియాలు

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లోనూ గిరిజన మ్యూజియాలు ఏర్పాటు చేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా తెలిపారు. మణిపూర్‌లో రాణిగైడిన్లు గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియంకు వర్చువల్‌ ద్వారా అమిత్‌ షా భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, గుజరాత్‌, జార్ఖండ్‌, చత్తీస్‌గఢ్‌, కేరళ, మధ్యప్రదేశ్‌ మణిపూర్‌ రాష్ట్రాల్లో మ్యూజియాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ రాష్ట్రాలకు రూ.110 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు.  అదే విధంగా దేశవ్యాప్తంగా మొత్తం గిరిజన మ్యూజియాలకు అభివృద్ధి కోసం రూ.195 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ మ్యుజియంలు సమాజంలో ఐక్యతకు తోడ్పడతాయన్నారు.

 

Tags :