MKOne Telugu Times Youtube Channel

అమిత్ షా హైదరాబాద్ పర్యటన ఖరారు

అమిత్ షా హైదరాబాద్ పర్యటన ఖరారు

బిజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఈ నెల 14న రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఆ రోజు మధ్యాహ్నం 2.30కి బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు అమిత్‌ షా రానున్నారు. సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ను సందర్శించనున్నారు. 14న సాయంత్రం 5 గంటలకు శంషాబాద్‌ నోవాటెల్‌కు అమిత్‌ షా రానున్నారు. 14న సాయంత్రం 6:30 గంటలకు తుక్కుగూడా సభాస్థలికి హోంమంత్రి చేరుకుంటారు. అదే రోజు రాత్రి 8:25  గంటలకు ఢిల్లీ కి బయల్దేరి వెళతారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో చీఫ్‌ బండి సంజయ్‌ రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర మే 14న మహేశ్వరంలో ముగుస్తుంది. ఈ సభకు అమిత్‌ షా రానున్నారు. తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌పై కేంద్రం, బీజేపీ రాజకీయ పోరాటం తీవ్రమవుతున్న తరుణంలో అమిత్‌ షా రాష్ట్రానికి రానుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

 

Tags :