మరో సారి కరోనా బారిన పడ్డ బిగ్ బి అమితాబ్ బచ్చన్

మరో సారి కరోనా బారిన పడ్డ బిగ్ బి అమితాబ్ బచ్చన్
బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్  రెండోసారి క‌రోనా (Covid 19) బారిన ప‌డ్డారు. వెంట‌నే ఆయ‌న హాస్పిట‌ల్‌లో జాయిన్ అయ్యారు. ఈ విష‌యాన్ని ఆయ‌న త‌న ట్విట్టర్ ద్వారా తెలియ‌జేశారు. రీసెంట్ టైమ్‌లో త‌న‌ను క‌లిసిన వారంద‌రూ కోవిడ్ టెస్టు చేయించుకోవాల‌ని సూచ‌న చేశారు. తాను కోవిడ్ పాజిటివ్ కార‌ణంగా చికిత్స తీసుకుంటున్న‌ట్లు బిగ్ బి తెలియ‌జేయ‌గానే అభిమానులు కంగారు ప‌డ్డారు. ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌న్నారు. 2020లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్ క‌రోనా బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న‌తో పాటు ఆయ‌న కుటుంబం అంతా హాస్పిట‌ల్లో జాయిన్ అయ్యారు. ఆ స‌మ‌యంలో అమితాబ్‌, అభిషేక్ బ‌చ్చ‌న్ ప‌రిస్థితి కాస్త సీరియ‌స్ అనే వార్త‌లు కూడా గ‌ట్టిగానే వినిపించాయి. ప్ర‌త్యేక‌మైన డాక్ట‌ర్స్ ప‌ర్య‌వేక్ష‌ణ చికిత్స కార‌ణంగా అమితాబ్ స‌హా ఆయ‌న కుటుంబ స‌భ్యులంద‌రూ క్షేమంగా బ‌య‌ట ప‌డ్డారు. ఇప్పుడు మ‌ళ్లీ ఆయ‌న కోవిడ్ బారిన ప‌డ‌టం అంద‌రిలో ఆందోళ‌న క‌లిగిస్తోంది. ప్ర‌స్తుతం బిగ్ బి.. కౌన్ బ‌నేగా క‌రోర్‌ప‌తి  ప్రోగ్రామ్‌కు సంబంధించిన చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నారు. మ‌రో వైపు సినిమాలు కూడా చేస్తున్నారు. ర‌ణ్‌భీర్‌, ఆలియా భ‌ట్ జంట‌గా న‌టించిన పాన్ ఇండియా మూవీ బ్ర‌హ్మాస్త్ర‌ లోనూ అమితాబ్ న‌టించిన సంగ‌తి తెలిసిందే.

https://twitter.com/SrBachchan/status/1562136557506613249?cxt=HHwWgsCqjYW76a0rAAAA

 

Tags :
ii). Please add in the header part of the home page.