అంబానీ ఇంట పెళ్లి సందడి

అంబానీ ఇంట పెళ్లి సందడి

రియలన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ఇంటపెళ్లి సందడి మొదలైంది. ముకేశ్‌, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. ఈ నేపథ్యంలో మెహందీ ఫంక్షన్‌ను వేడుకగా నిర్వహించారు. ఈ వేడుకలో రాధిక మర్చెంట్‌ పింక్‌ కలర్‌ లెహంగాలో మెరిసిపోయారు. బాలీవుడ్‌ నటి ఆలియాభట్‌ పాటకు డ్యాన్స్‌ చేసి సందడి చేశారు. అనంత్‌-రాధిక మర్చంట్‌ల నిశ్చితార్ధం గతేడాది డిసెంబర్‌లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. రాజస్థాన్‌లోని శ్రీనాథ్‌జీ ఆలయంలో ఈ వేడుకను అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య వైభవంగా నిర్వహించారు. నిశ్చితార్థం అనంతరం ముంబయిలోని అంబానీ నివాసంలో ఆంటిలియాలో గ్రాండ్‌పార్టీ  ఆరేంజ్‌ చేశారు. ఈ పార్టీకి బాలీవుడ్‌ సెలబ్రిటీలు, ఇతర రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేశారు. 

 

 

Tags :